WFI Chief Brij Bhushan : నేను వినను రాజీనామా చేయను
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్
WFI Chief Brij Bhushan : తాను ఎవరు చెప్పినా వినదల్చు కోలేదని, ఇప్పటి దాకా ప్రధానమంత్రి మోదీ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో మాట్లాడ లేదని అయినా తాను రాజీనామా(WFI Chief Brij Bhushan) చేసే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టారు బీజేపీ ఎంపీ డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. ఆయన తప్పుకోవాలని, వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ మహిళా రెజ్లర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
దేశ రాజధానిలోని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. శుక్రవారం నాటితో మూడు రోజులవుతోంది. తమను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, ఆయన అండ చూసుకుని కోచ్ లు అమ్మనా బూతులు తిడుతున్నారంటూ ప్రముఖ భారతీయ రెజ్లర్లు వినేష్ ఫోగట్ , వీణా మాలిక్ , పూనియా , తదితర మహిళా రెజ్లర్లు 30 మందికి పైగా ఆందోళనలో పాల్గొంటున్నారు.
ఇప్పటికే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ స్పందించారు. బాధిత మహిళలను పరామర్శించారు. ఆ వెంటనే బ్రిజ్ భూషణ్ శరణ్ కు , ఇతర కోచ్ లు(WFI Chief Brij Bhushan), క్రీడా కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో పలువురు నాయకులు పరామర్శించినా వారిని ఆందోళన చేపట్టిన వేదికపైకి రానివ్వలేదు.
అందులో ఒకరు సీపీఎం నాయకురాలు బృందా కారత్ కాగా ఇంకొకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్ల యోధుడు విజేందర్ సింగ్. అయితే నిరసన మద్దతుదారులతో కలిసి నేలపైనే కూర్చున్నారు. మరో వైపు కేంద్రం 72 గంటల గడువు ఇచ్చినా స్పందించ లేదు. మహిళా రెజ్లర్లు మాత్రం తగ్గేదే లేదంటున్నారు.
Also Read : క్రీడా లోకం వేధింపుల పర్వం