Wrestlers Protest : ముదిరిన వివాదం రెజ్ల‌ర్ల ఆగ్ర‌హం

త‌ప్పుకోన‌న్న బ్రిజ్ భూషన్ శ‌ర‌ణ్

Wrestlers Protest : మీటూ వివాదంలో ఇరుక్కున్న భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ తాను త‌ప్పుకోనంటున్నారు. మ‌రో వైపు కేంద్రం ఇచ్చిన 72 గంట‌ల గ‌డువు ముగిసింది. ఇప్ప‌టికే గురువారం అర్ధ‌రాత్రి నాలుగు గంట‌ల పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చ‌ర్చ‌లు జ‌రిపారు మ‌హిళా రెజ్ల‌ర్ల‌తో(Wrestlers Protest). కానీ చ‌ర్చ‌లు స‌ఫ‌లం కాలేదు. సింగ్ ను తొల‌గించేంత వ‌ర‌కు తాము ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు.

తాను మాట్లాడితే సునామీ వ‌స్తుంద‌న్నారు బ్రిజ్ భూష‌ణ్ శర‌ణ్ సింగ్. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మ‌హిళా రెజ్ల‌ర్లు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. తాను ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డ్డాన‌ని చెప్పారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని గోండాలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను ఎవ‌రి ద‌యా దాక్షిణ్యాల‌పై ఆధార‌ప‌డి లేన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్‌.

దీంతో కేంద్రం సీరియ‌స్ అయ్యింది. వెంట‌నే క్రీడా శాఖ మంత్రి ఠాకూర్ రెస్పాండ్ అయ్యారు. ఆ వెంట‌నే బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ కు ఫోన్ చేశారు. ఎలాంటి కామెంట్స్ చేయొద్దంటూ హెచ్చ‌రించారు. మ‌రో వైపు ఫెడ‌రేష‌న్ చీఫ్ పై రెజ్ల‌ర్ల లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌పై భార‌త ఒలింపిక్ సంఘం అత్యవ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించింది(Wrestlers Protest).

మ‌హిళా రెజ్ల‌ర్లు బ్రిజ్ భూష‌ణ్ పై చ‌ర్య తీసుకోవాల‌ని కోరుతూ భార‌త ఒలింపిక్ సంఘం చీఫ్ పీటీ ఉష‌కు లేఖ రాశారు. టోక్యోలో ఒలింపిక్ ప‌త‌కాన్ని కోల్పోయిన త‌ర్వాత వినేష్ ఫోగ‌ట్ ను సింగ్ మాన‌సికంగా వేధించారంటూ మ‌హిళా రెజ్ల‌ర్లు ఆరోపించారు. ఈ మేర‌కు లేఖ‌లో పేర్కొన్నారు.

Also Read : బాక్స‌ర్ విజేంద‌ర్ సింగ్ కు నో ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!