Modi BBC Documentary Block : బీబీసీ డాక్యుమెంటరీపై గుస్సా
లింకులు తొలగించాలంటూ ఆదేశం
Modi BBC Documentary Block : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మోదీ గుజరాత్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో చోటు చేసుకున్న అల్లర్లు, దాని వెనుక ఉన్న హింస, ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న విద్వేషానికి మోదీనే బాధ్యుడనే అర్థం వచ్చేలా దీనిని రూపొందించింది.
దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఆపై కేంద్ర ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు కేంద్ర ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. ఈ డాక్యుమెంటరీకి చెందిన ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్ , లింక్డ్ ఇన్ , తదితర మాధ్యమాలలో ఉన్న లింకులను వెంటనే తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా బీబీసీ మోదీకి సంబంధించి ఇండియా ది మోదీ క్వశ్చన్ అనే పేరుతో రెండు భాగాలుగా డాక్యుమెంటరీని(Modi BBC Documentary Block) రూపొందించింది. 2002లో చోటు చేసుకున్న అల్లర్లను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఒక రకంగా మోదీని నిలదీసింది..ప్రశ్నించింది కూడా. ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణితో, వ్యక్తిగతంగా మోదీని డ్యామేజ్ చేసేందుకు కావాలని చేసిన ప్రయత్నం అంటూ నిప్పులు చెరిగింది కేంద్రం.
ఇదిలా ఉండగా ఆనాటి అల్లర్లకు సంబంధించి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ బీబీసీ దీనిని మరోసారి తెర పైకి తీసుకు వచ్చింది. దీనిపై అభ్యంతరం తెలియ చేస్తూ న్యాయవాది జిందాల్ ఫిర్యాదు చేశారు. కోర్టులో దావా కూడా వేశారు.
Also Read : రాజ్యాంగం ఆత్మను అర్థం చేసుకోవాలి