LIC ADO Jobs : అద్భుత అవ‌కాశం కొలువుల మేళం

9,394 ఏడీఓ పోస్టుల‌కు నోటిఫికేష‌న్

LIC ADO Jobs : డాల‌ర్ల మాయ‌లో ప‌డి ఐటీ రంగంలో కొలువులు ఉంటాయో ఉండ‌వోన‌న్న మీమాంస‌లో కొట్టుకు చ‌స్తున్న వారికి , ఇప్ప‌టికే డిగ్రీ పూర్త‌యిన అభ్య‌ర్థుల‌కు అద్భుత‌మైన అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది భార‌తీయ జీవిత భీమా సంస్థ (ఎల్ఐసీ). భారీ వేత‌నంతో కూడిన జాబ్స్ ను ప్ర‌క‌టించింది సంస్థ‌. కేవ‌లం డిగ్రీ అర్హ‌త ఉంటే చాలు రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌న ఏకంగా 9,394 పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

కేవ‌లం ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉన్న వారు ఎల్ఐసీలో అప్రెంటీస్ డెవ‌ల‌ప్ మెంట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి(LIC ADO Jobs) ప‌చ్చ జెండా ఊపింది. దేశవ్యాప్తంగా వీటిని భ‌ర్తీ చేయ‌నుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ‌ల‌లో కూడా ఏడీఓ పోస్టులు కూడా ఉన్నాయి. హైద‌రాబాద్ లో ఏకంగా 1408 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల‌కు అప్లై చేసుకునే వారు ఏదైనా డిగ్రీ లేదా త‌త్స‌మాన కోర్సు పూర్తి చేసి ఉంటే చాలు.

ఇక అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు జ‌న‌వ‌రి 1, 2023 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఆయా సామాజిక వ‌ర్గాల‌కు సంబంధించి రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం ఉంటుందని ఎల్ఐసీ పేర్కొంది. అర్హులైన , ఆస‌క్తి క‌లిగిన వారు వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రి 10 లోపు ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. జ‌న‌ర‌ల్ కేట‌గిరీ అభ్య‌ర్థులు రూ. 750 , ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థులు రూ. 100 ఫీజు కింద చెల్లించాలి.

రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రాథ‌మిక ప‌రీక్ష మార్చి 12న‌, మెయిన్స్ ఏప్రిల్ 8న నిర్వ‌హిస్తారు. ఎంపికైన వారికి రూ. 51,500 నుంచి రూ. 90,205 దాకా వేత‌నం ల‌భిస్తుంది.

Also Read : గూగుల్ లో 12,000 మంది తొల‌గింపు

Leave A Reply

Your Email Id will not be published!