TS Governor CM KCR : ఆహ్వానమా లేక అవ‌మానమా

బ‌డ్జెట్ స‌మావేశాల‌కు మేడం వ‌స్తారా

TS Governor CM KCR : అసెంబ్లీ స‌మావేశాలు సంప్ర‌దాయ బ‌ద్దంగా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంతో మొద‌ల‌వుతుంది. మొద‌ట‌గా ప్ర‌భుత్వం ప్ర‌సంగ పాఠం త‌యారు చేస్తుంది. దీనిని పొల్లు పోకుండా గ‌వ‌ర్న‌ర్ చ‌ద‌వ‌డం, ఆ త‌ర్వాత స‌మావేశాలు ప్రారంభం కావడం ష‌రా మూమూలే. కానీ తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన డాక్ట‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర రాజ‌న్ గ‌వ‌ర్న‌ర్ గా ఉన్నారు.

ఆమె కొలువు తీరిన మొద‌ట్లో సీఎం కేసీఆర్ బాగానే ఉన్నారు. ఎప్పుడైతే గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ ఎంపిక విష‌యంలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి బంధువు అయిన పాడి కౌషిక్ రెడ్డికి సంబంధించి అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది గ‌వ‌ర్న‌ర్ . ఇదే అంశానికి సంబంధించి మీడియా స‌మావేశంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

గ‌వ‌ర్న‌ర్ కోటాలో స‌మాజానికి సేవ చేసిన వాళ్లు లేదా వివిధ రంగాలలో నిస్వార్థంగా సేవ‌లు అందించిన వారిని సిఫార‌సు చేయాలే కానీ ఫ‌క్తు రాజ‌కీయాలు చేస్తూ , కేసులు న‌మోదైన వాళ్ల‌ను తాను ఒప్పుకోనంటూ స్ప‌ష్టం చేశారు గ‌వ‌ర్న‌ర్. దీనిపై కేసీఆర్ భ‌గ్గుమ‌న్నారు. ఆనాటి నుంచి నేటి దాకా ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగింది. మాట‌ల యుద్దం కొన‌సాగుతూ వ‌చ్చింది.

తాజాగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భంలో సైతం ఎడ మొహం పెడ మొహంగా ఉన్నారు. బీఆర్ఎస్ నేత‌లు గ‌వ‌ర్న‌ర్ బీజేపీ కార్య‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ ఆరోపించారు. తమిళి సై సౌంద‌ర రాజ‌న్ మాత్రం ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ‌హిస్తోంది. బ‌హిరంగంగానే ప్ర‌భుత్వ ప‌నితీరును ఏకి పారేస్తోంది(TS Governor CM KCR).

ఈ త‌రుణంలో గ‌తంలో జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల‌కు గ‌వ‌ర్న‌ర్ ను ప‌క్క‌న పెట్టింది ప్ర‌భుత్వం. తాజాగా ఫిబ్ర‌వ‌రి 3న బ‌డ్జెట్ స‌మావేశాల‌కు సంబంధించి ముహూర్తం ఖ‌రారు చేసింది. ఈసారి కూడా త‌మిళిసైని ఆహ్వానిస్తారా లేక అవ‌మానిస్తారా అన్న‌ది వేచి చూడాలి.

Also Read : తెలంగాణ‌కు రూ. 21 వేల కోట్లు – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!