Akhilesh Yadav : 2024 ఎన్నిక‌ల్లో బీజేపీకి షాక్ త‌ప్ప‌దు

మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ కామెంట్స్

Akhilesh Yadav : స‌మాజ్ వాది పార్టీ చీఫ్‌, మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav)  షాకింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే 2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి కోలుకోలేని షాక్ తప్ప‌ద‌ని జోష్యం చెప్పారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని 80 పార్ల‌మెంట్ స్థానాల‌లో అప‌జ‌యం ఎదుర్కో బోతున్నార‌ని పేర్కొన్నారు.

అఖిలేష్ యాద‌వ్ మీడియాతో మాట్లాడారు. అంతే కాకుండా ఆయా క‌స్ట‌డీల‌లో చ‌ని పోయిన వారి కుటుంబాల‌కు ప్ర‌భుత్వం రూ. కోటి, ప్ర‌భుత్వ ఉద్యోగం ఇచ్చేలా తీర్మానం చేయాల‌ని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. గ‌తంలో పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకు వ‌స్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికార‌ని కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క కంపెనీ రాలేద‌ని ఎద్దేవా చేశారు.

ప్ర‌చార ఆర్భాటం త‌ప్పా చేసిన ఒక్క‌పని ఏమిటో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని అన్నారు అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav) . మ‌రో 50 ఏళ్ల పాటు పాలిస్తామ‌ని అంటున్నారు. ఆ పార్టీ జాతీయ చీఫ్ జేపీ న‌డ్డా చిలుక ప‌లుకులు ప‌లుకుతున్నారంటూ మండిప‌డ్డారు. విద్య‌, వైద్యం అట‌కెక్కింద‌ని ఆట‌విక రాజ్యం న‌డుస్తోంద‌ని ఆరోపించారు అఖిలేష్ యాద‌వ్.

బీజేపీ పూర్తిగా అన్ని వ‌ర్గాల వారి ప‌ట్ల వివ‌క్ష‌ను చూపుతోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో సామాన్యులు బ‌తికే ప‌రిస్థితులు లేకుండా పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. లండ‌న్ , న్యూయార్క్ నుండి పెట్టుబ‌డులు తీసుకు వ‌స్తామ‌ని చెప్పిన వారి మాట‌ల‌న్నీ ఉత్త‌వేన‌ని తేలి పోయింద‌న్నారు స‌మాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్.

Also Read : దేశ ప‌రువును త‌గ్గించే ప్ర‌య‌త్నం – రిజిజు

Leave A Reply

Your Email Id will not be published!