Arjun Munda : ఆదివాసీలదే అడవి – అర్జున్ ముండా
ఆదివాసీల సమస్యలు ప్రధాని దృష్టికి
Arjun Munda : ఈ దేశంలో అడవిని నమ్ముకున్న ఆదివాసీలు ఎందరో ఉన్నారు. వాళ్లకు అడవే జీవనాధారం. ఆ అడవిపై వారికే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా(Arjun Munda). ఇన్నేళ్లైనా ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు.
ఆదివారం కేస్లాపూర్ నాగోబో జాతర సందర్భంగా కేంద్ర మంత్రి స్టేట్ చీఫ్ బండి సంజయ్ తో కలిసి సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు అర్జున్ ముండా. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదివాసీలను ఆదుకుంటామని, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మెస్రం వంశీయుల చందాలతో గుడిని నిర్మించడం తనకు సంతోషం కలిగించిందని చెప్పారు అర్జున్ ముండా. ఇదే సమయంలో ఆదివాసీలు అడవితోనే మమేకమై జీవిస్తారని వారికి మోసం చేయడం రాదన్నారు. అలాంటి వారిని కూడా సీఎం కేసీఆర్ మాయ మాటలు చెప్పి దగా చేయడం దారుణమన్నారు.
నాగోబా ఆలయ అభివృద్దికి అవసరమైన నిధులను కేంద్రం మంజూరు చేస్తుందని స్పష్టం చేశారు. తాను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకు వెళతానని వెంటనే మంజూరు అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు అర్జున్ ముండా(Arjun Munda). ప్రతి ఆదివాసీ బిడ్డకు ఇళ్లు నిర్మించేలా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్నారు.
అంతే కాదు దేశ చరిత్రలో ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిగా నియమించిన ఘనత ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందన్నారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ పవర్ లోకి వస్తే విద్య, వైద్యం, విద్యుత్ ఉచితంగా ఇస్తామన్నారు.
Also Read : అంబురం నాగోబా జాతర సంబురం