IND vs NZ Hockey World Cup : కీవీస్ దెబ్బకు భారత్ ఔట్
చేతులెత్తేశారు ఇంటి బాట పట్టారు
IND vs NZ Hockey World Cup : భారత్ ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచ కప్ హాకీ టోర్నీలో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలై ఇంటి బాట పట్టింది భారత హాకీ జట్టు. న్యూజిలాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో ఒకానొక దశలో 2-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న ఇండియాను కీవీస్ జట్టు కోలుకోని రీతిలో దెబ్బ కొట్టింది.
వరల్డ్ కప్ గెలవాలన్న ఆశలపై నీళ్లు చల్లింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి భారత్ ఆధిక్యంలో ఉంది. మొత్తం మ్యాచ్ లో 11 పెనాల్టీలు లభించాయి. వాటిలో కేవలం రెండింటిని మాత్రమే గోల్స్ గా మలిచింది భారత్. వాటిని సద్వినియోగం చేసుకోలేక పోయారు ఆటగాళ్లు. ఇదే సమంలో సెకండ్ హాఫ్ లో ఊహించని రీతిలో న్యూజిలాండ్ జట్టు పుంజుకుంది(IND vs NZ Hockey World Cup) .
భారత్ గోల్స్ ను సమం చేసింది. దీంతో ఇరు జట్లు సమానం గా నిలవడంతో షూటౌట్ తప్పనిసరైంది. కానీ చివరకు న్యూజిలాండ్ భారత్ ను నిలువరించింది. ఏకంగా క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. ఇదే సమయంలో టోర్నీలో భాగంగా జరిగిన మరో మ్యాచ్ లో స్పెయిన్ మలేషియాకు షాక్ ఇచ్చింది. నేరుగా క్వార్టర్స్ కు చేరుకుంది.
ఇదిలా ఉండగా ఒడిశా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వరల్డ్ కప్ కు ఏర్పాట్లు చేసింది. అంతే కాదు సీఎం నవీన్ పట్నాయక్ సంచలన ప్రకటన చేశారు. భారత జట్టు గనుక హాకీ వరల్డ్ కప్ గెలిస్తే ఒక్కో ఆటగాడికి ప్రభుత్వం తరపున రూ. కోటి బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కోట్లాది హాకీ క్రీడాభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు ఆటగాళ్లు. చివరకు అపజయంతో నిరాశకు గురి చేశారు.
Also Read : శుభ్ మన్ గిల్ ఆట అద్భుతం