Rahul Yatra Comment : ద్వేషం నశించాలి ప్రేమ వర్దిల్లాలి
కల్లోల కాశ్మీరం లో శాంతి కపోతం
Rahul Yatra Comment : నిత్యం తుపాకుల మోత, ఖాకీల జాడల వెనుక కల్లోల కాశ్మీరం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మొదటిసారిగా కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టారు.
పెద్ద ఎత్తున ఆయనకు జనం నీరాజనం పలుకుతున్నారు. బహుషా జాతీయ మీడియా అంతగా రాహుల్ గాంధీపై ఫోకస్ పెట్టలేదు. మోదీ ప్రభంజనం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో భారత్ జోడో యాత్ర(Rahul Yatra) కొనసాగడం ఒకింత విస్తు పోయేలా చేసింది.
ఇది ఆనాటి జాతీయ ఉద్యమాన్ని , స్వాతంత్రం కోసం జరిగిన పోరాటం సందర్భంగా సాగిన యాత్రను గుర్తు చేసింది. ఈ అద్భుతమైన ఆలోచన రావడం కూడా గొప్ప విషయమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అంపశయ్యపై వేలాడుతోంది.
వయస్సు మళ్లిన తరం ఓ వైపు యువ నాయకత్వం ఇంకో వైపు ఊగిస లాడుతున్న సమయంలో ఒక్కసారిగా జోడో యాత్ర తిరిగి శ్వాసను అందించేలా చేసింది పార్టీకి. దానిని నమ్ముకున్న శ్రేణులకు.
జమ్మూ, కాశ్మీర్ ఈ ప్రాంతం నిషిధ్దమైనదిగా, అక్కడి జనం తుపాకుల నీడన బతుకుతారన్న ఓ భావన ఆనాటి నుంచి నేటి దాకా కొనసాగుతూ వచ్చింది. దీనిని కాదనలేం.
దేశం విభజనకు గురైన నాటి నుంచి ఇప్పటి వరకు నిత్యం వివాదాలు, కాల్పులు, ఆరోపణలు, దాడులు, ప్రాణాలు కోల్పోవడాలు జరుగుతూ వస్తున్నవే.
ఓ వైపు రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర(Rahul Yatra) జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతుందా అన్న అనుమానం నెలకొన్న తరుణంలో దానిని పటాపంచలు చేస్తూ ముందుకు సాగడం కాషాయ శ్రేణులను విస్మయ పరిచేలా చేసింది.
ఆనాటి ఇందిర , రాజీవ్ గాంధీ ఇద్దరూ తూటాలకు బలై పోయిన వాళ్లే. బిక్కు బిక్కుమంటూ తలదాచుకుని ఇవాళ దేశానికి కావాల్సింది ద్వేషం కాదు ప్రేమ కావాలని కోరుతూ వేల కిలోమీటర్లు చలిని దాటుకుంటూ యాత్ర చేపట్టడాన్ని ఎవరూ కాదనలేరు.
అలా అన్న వారు విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్టే అనుకోవాలి. చిన్నారుల నుంచి వయస్సు మళ్లిన వారంతా ఎముకలు కొరికే చలిలో, వర్షపు చినుకుల మధ్య రోడ్లపైనే నిలబడటం ప్రేమ కాక ఇంకేంటి.
పప్పూ అని ఎద్దేవా చేసిన వాళ్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వాళ్లు తెలుసు కోవాల్సింది ఒక్కటే. అతడు చేసిన ఈ పాదయాత్ర
ప్రయాణం మాత్రం దేశాన్ని ఆలోచింప చేసిందన్నది వాస్తవం.
కాదనలేని సత్యం. ఇలా ఎంత కాలం మతం పేరుతో ముందుకు సాగుతాం. పదవులను ప్రేమించిన వాళ్లు..అధికారం కోసం వేచి చూస్తున్న వాళ్లు విస్తు
పోయేలా రాహుల్ గాంధీ ఒంటరిగానే కల్లోల కాశ్మీరంలోకి అడుగు పెట్టారు.
బహుశా ద్వేషం కాదు కావాల్సింది..ప్రేమ కావాలి..అంతకు మించి ప్రశాంతతతో కూడిన శాంతి కావాలి. నోట్లు..ఓట్లు..సీట్ల సంఖ్యగా మారి పోయిన ప్రస్తుత రాజకీయ చదరంగంలో కాంగ్రెస్ మళ్లీ ఓడి పోవచ్చు..
బీజేపీ అధికారంలోకి రావచ్చు..కానీ భారత్ జోడో యాత్ర(Rahul Yatra) మాత్రం చరిత్రలో చిరస్మరణీయమైన యాత్రగా మిగిలి పోవడం మాత్రం ఖాయం.
Also Read : కన్నడ నాట అమిత్ షా రోడ్ షో