KTR Modi : మోడీపై కేటీఆర్ సెటైర్
ఆయన యుద్దాన్ని ఆపారట
KTR Modi : తెలంగాణ ఐటీ ,పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్దాన్ని ఆపారంటూ బీజేపీ దాని అనుబంధ సంస్థలు ప్రచారం చేసుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.
దేశంలో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించ లేక పోయారని మోడీ ఎలా అంతర్జాతీయ సమస్యను పరిష్కరించాడో తనకు అర్థం కావడం లేదన్నారు కేటీఆర్(KTR Modi) . విచిత్రం ఏమిటంటే ఆ రెండు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రభుత్వాలే ఉన్నాయని అన్నారు.
పాలన చేతకాక కేవలం ప్రచారం మీద మాత్రమే ఫోకస్ పెట్టిన మోడీ గురించి అబద్దపు ప్రచారం కొనసాగుతోందన్నారు కేటీఆర్. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడంలో టాప్ లో కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. తన ఇంటిని చక్కదిద్ద లేని మోడీ ఎలా ఉక్రెయిన్ ,రష్యా యుద్దాన్ని ఆపాడో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆకాశానికి ఎత్తేయడంలో, మోడీని అభినవ భారత నిర్మాత అనడంలో కాషాయ శ్రేణులు పోటీ పడుతున్నాయంటూ మండిపడ్డారు మంత్రి. జీఎస్టీ పరంగా దేశంలోనే తెలంగాణ అత్యధికంగా వసూలు చేసి ఇచ్చిందన్నారు. కానీ ఇప్పటి దాకా ఒక్క పైసా కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు కేటీఆర్.
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటున్నారని కానీ చేతల్లో అలాంటిది ఏమీ లేదన్నారు మంత్రి. ఇకనైనా అబద్దాలను ప్రచారం చేయొద్దంటూ కోరారు. బీజేపీది ప్రచార ఆర్భాటమే తప్పా అంతా బక్వాస్ అని కొట్టి పారేశారు.
Also Read : బీజేపీ లక్ష్యం వైసీపీ అంతం