India Post GDS 2023 : పోస్టాఫీసుల్లో భారీగా కొలువులు

40,889 జాబ్స్ కు నోటిఫికేష‌న్

India Post GDS 2023 : దేశంలోనే అత్య‌ధిక నెట్ వ‌ర్క్ క‌లిగిన ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో పోస్టాఫీస్ ఒక‌టి. భార‌తీయ పోస్టల్ శాఖ భారీ ఎత్తున కొలువుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది(India Post GDS 2023) . ఎలాంటి రాత ప‌రీక్ష కానీ లేదా ఇంట‌ర్యూ లేకుండానే వీటిని భ‌ర్తీ చేయ‌నుంది. ఇందుకు ఎలాంటి డిగ్రీలు, ఉన్న‌త చ‌దువులు చ‌ద‌వాల్సిన ప‌ని లేదు.

కేవ‌లం 10వ త‌ర‌గ‌తి పాసైతే చాలు. దేశ వ్యాప్తంగా 40,889 గ్రామీణ్ డాక్ సేవ‌క్ (జీడీఎస్) ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 10 వ త‌ర‌గ‌తిలో వ‌చ్చిన మార్కుల ఆధారంగా వీటిని చేప‌డ‌తారు. ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్ట‌ర్ (బీపీఎం) , అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్ట‌ర్ (ఏబీపీఎం) , డాక్ సేవ‌క్ ల‌ను నిర్వ‌హించాల్సి ఉంటుంది.

ఆయా పోస్టుల‌ను బ‌ట్టి రూ. 10 వేల నుంచి రూ. 12 వేల దాకా ప్రారంభ వేత‌నం ల‌భిస్తుంది. వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రి 16 లోగా ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇరు తెలుగు రాష్ట్రాల‌లో ఏపీలో 2,480 పోస్టులు ఉండ‌గా తెలంగాణ రాష్ట్రంలో 1,266 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వీరికి ల్యాప్ టాప్ ,కంప్యూట‌ర్ , స్మార్ట్ ఫోన్ కూడా స‌మ‌కూరుస్తుంది. స్థానిక భాష వ‌చ్చి ఉండాలి. సైకిల్ కూడా క‌లిగి ఉండాలి. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు 18 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ , ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు , దివ్యాంగుల‌కు 10 ఏళ్ల స‌డ‌లింపు ఉంటుంది. ఆన్ లైన్ లో స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఎలాంటి పైర‌వీల‌ను ప్రోత్స‌హించేందుకు ఆస్కారం ఉండ‌దు.

Also Read : ప్ర‌తిప‌క్షాల‌ విమ‌ర్శ‌లు సిల‌బ‌స్ లో లేవు

Leave A Reply

Your Email Id will not be published!