PV Ramesh: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కు నేనే ప్రత్యక్ష బాధితుడిని – రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కు నేనే ప్రత్యక్ష బాధితుడిని - రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్

PV Ramesh: ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు తానే ప్రత్యక్ష బాధితుడినని రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ పీవీ రమేశ్‌… తన సోషల్ మీడియా ఎక్స్‌ ద్వారా ఆరోపించారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్‌ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. ఆ దరఖాస్తును తహసీల్దార్‌ తిరస్కరించారని, ఆర్డీవోకి పోస్టులో పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేసినట్లు ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించారు. చట్టం అమల్లోకి రాకముందే తన తల్లిదండ్రుల భూములపై తనకు హక్కులు నిరాకరించారని… ఐఏఎస్‌ అధికారిగా 36 ఏళ్లపాటు ఏపీలో సేవలందించిన అధికారి పరిస్థితే ఇలా ఉంటే, సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేమని ట్వీట్‌లో పేర్కొన్నారు.

దీనితో రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్(PV Ramesh) ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోను అదే విధంగా రైతుల్లోని ఆందోళనకు కారణమైంది. అయితే చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ రమేశ్… అసత్య ప్రచారాలతో ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీకు చెందిన సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అసలు అమలులోనికి రాని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇలాంటి దుష్ప్రాచారం చేయడం దారుణమంటూ పోస్టులు పెడుతున్నారు.

PV Ramesh – పీవీ రమేశ్ పోస్ట్ పై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు

పీవీ రమేశ్‌ పోస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. సీఎంఓలో పనిచేసిన ఐఏఎస్‌ అధికారి పరిస్థితే ఇదైతే… సామాన్యుడి పరిస్థితి ఏంటో ఊహించాలని ఎక్స్‌లో సోమవారం పేర్కొన్నారు. ‘‘ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం అమల్లోకి వస్తే మీ భూమి, ఇల్లు, స్థలం మీది కాదు’’ అని ప్రజల్ని హెచ్చరించారు. తాను అధికారంలోనికి వస్తే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు ఫైల్ పై రెండో సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. ‘‘ఆస్తి కొట్టేస్తే ఊరుకోవడానికి మీ చెల్లెలు అనుకున్నారా? కష్టపడి సంపాదించిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన భూముల్ని ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌తో లాక్కోవాలని చూస్తే జనం మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు’’ అని సీఎం జగన్‌ను తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా హెచ్చరించారు.

Also Read : DIG Ammi Reddy: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు ! 

Leave A Reply

Your Email Id will not be published!