Me Too India Comment : వేధింపుల పర్వం ఇంకెంత కాలం
ప్రతి చోటా లైంగిక వేదనలే
Me Too India Comment : మీ టూ అనేది గత కొంత కాలంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. దీని వెనుక అతి పెద్ద కథ ఉంది. అన్నింటి కంటే ఎక్కువగా వ్యక్తిత్వాన్ని హరించి వేసి, శారీరకంగా , మానసికంగా వేధింపులకు గురవుతున్న వాళ్లు లెక్కకు మించి ఉన్నారు.
లెక్కించ లేనంత మంది బాధితుల చిట్టా కొనసాగుతూనే ఉంది. దీనిని నియంత్రించే వ్యవస్థలు ఏవీ పని చేయడం లేదు. ఎవరైతే శిక్షిస్తారో వారే ఇలాంటి వాటికి ఎక్కువగా పాల్పతుండడం ఆశ్చర్యం కలిగించే అంశం.
ఒకరకంగా కంట తడి పెట్టేలా..కన్నీళ్లు తెప్పించేలా ఉంటున్నాయి. ఇటీవల మరోసారి మీటూ చర్చకు వచ్చింది. దేశ రాజధానిలో దేశం కోసం ఆడుతున్న వాళ్లు, జాతీయ పతాకాన్నిఎగుర వేసే వాళ్లు.
మువ్వొన్నెల భరత మాతకు గౌరవాన్ని(Me Too India) తీసుకు వచ్చే వాళ్లు..తమకు అన్యాయం జరుగుతోందని, తాము తట్టుకోలేక పోతున్నామంటూ బయటకు వచ్చారు.
రోడ్డెక్కారు..కన్నీళ్లు కార్చారు. బహుషా మార్కెట్ మయమై పోయిన ఈ ప్రస్తుత సమాజంలో ఆ కన్నీళ్లకు స్పందించిన వాళ్లు చాలా తక్కువ.
ఎందుకంటే అధికారమనే మాయలో పడి కొట్టుకు చస్తున్న వాళ్లకు మహిళల ఆక్రందన అర్థం(Me Too India అవుతుందని అనుకోలేం. అలా అనుకుంటే పొరపాటు పడినట్లే.
ఓ వైపు చలి వణికిస్తున్నా వారంతా ఆందోళన బాట పట్టారు. దీనికి కమిటీని ఏర్పాటు చేసి..విచారించాక చర్యలు తీసుకుంటామని కేంద్రం చావు కబురు చల్లగా చెప్పింది.
ప్రధానంగా వారు ఏం కోరుతున్నారనే దానిని ఎవరూ పట్టించు కోలేదు. జాతీయ మీడియా గత్యంతరం లేక వారి ఆవేదనను ప్రసారం చేసింది. లేక పోతే పొద్దస్తమానం మోదీ భజనలో తరించి ఉండేది. సోషల్ మీడియా పుణ్యమా అని వారి నిరసన ప్రపంచమంతటా తెలిసింది.
చివరకు పరువు పోతుందని తెలిసి కేంద్రం రంగంలోకి దిగింది. పైపై చర్యలకు ఉపక్రమించింది.
బహిరంగంగా మహిళలు సంచలన ఆరోపణలు చేసినప్పుడు రెజ్లింగ్ అసోసియేషన్ చీఫ్ ను తప్పిస్తే తప్పేంటి..ఎందుకు వెనకేసుకు వస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది.
విచిత్రం ఏమిటంటే భారతీయ క్రీడా రంగం ఇప్పుడు రాజకీయ నాయకుల చేతుల్లో , ప్రత్యేకించి కాషాయ శ్రేణుల దయా దాక్షిణ్యాల మీద ఆధార పడి ఉంది. ఎర్రకోట వేదికగా మోదీ మహిళా సాధికారత గురించి గొప్పగా మాట్లాడారు.
కానీ ఆచరణలో ఎక్కడా లేని రీతిలో మహిళలు హింసకు, లైంగిక దోపిడీకి లోనవుతున్నారు. ప్రధానంగా దేశీయ క్రీడను పొలిటికల్ బేహారులు నడుపుతున్నారు. వాళ్లు ఎప్పుడూ గల్లీ క్రికెట్ ఆడలేదు. రాకెట్ ను ఎత్త లేదు. కానీ దశాబ్దాలుగా క్రీడా సమాఖ్యలను వారి స్వంత రాజ్యాలుగా నడిపిస్తూ వస్తున్నారు.
క్రీడలకు సంబంధించి క్రీడాకారులు ఉండాలి. కానీ లేరు. ఉండరు కూడా.. మహిళా క్రీడాకారులకు ప్రపంచంలో అత్యంత భద్రత లేని దేశం ఏదైనా ఉందంటే అది ఇండియానేనని చెప్పుకోక తప్పదు. కొన్ని ఫిర్యాదులు మాత్రమే బయటకు వస్తున్నాయి.
కానీ కనిపించని వేధింపుల పర్వం ఎన్నో..ఇతర దేశాలలో జీవిత కాలం పాటు నిషేధం విధించిన దాఖలాలు ఉన్నాయి. కానీ భారత్ లో అలా కాదు. వారి వెనుక రాజకీయం ఉంటుంది. ప్రభుత్వ అండదండలు ఉంటాయి.
ఒక్క క్రీడా రంగమే కాదు సినిమా, రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగాలలో ఈ వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉన్నది. దీనికి అంతం లేదా అంటే ఉంది..ఎవరైతే మహిళలు, బాలికలు, యువతులు ఉన్నారో వారే ధైర్యం ప్రదర్శించాలి.. ఎదిరించాలి..నిలదీయాలి..ప్రశ్నించాలి.. ఆనాడే వారికి స్వేచ్ఛ దొరుకుతుంది.
Also Read : అమర వీరులకు రాహుల్ నివాళి