Sonam Wangchuk Comment : యోధుడు ల‌డ‌ఖ్ పాలిట దేవుడు

సోన‌మ్ వాంగ్ నిజ‌మైన భార‌తీయుడు

Sonam Wangchuk Comment : ల‌డ‌ఖ్ ఈ పేరు నిత్యం వినిపిస్తూ ఉండేదే. కానీ దీనికి ప్ర‌త్యేక‌త ఉంది. హిమ‌నీ న‌దాల‌తో అల‌రారుతూ ఉంది ఈ ప్రాంతం. కానీ ప్ర‌స్తుతం కాలుష్య‌పు కోర‌ల్లో చిక్కుకుంది.

శ్వాస పీల్చుకునేందుకు తండ్లాడుతోంది. దీనిని ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చించుకునేలా చేశాడు ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌, కార్య‌క‌ర్త‌, సోష‌ల్ ఇంజ‌నీర్ సోన‌మ్ వాంగ్ చుక్(Sonam Wangchuk) .

ఆయ‌న భార‌త రాజ్యాంగం దినోత్స‌వ వేడుక జ‌న‌వ‌రి 26న నిర‌స‌న ప్ర‌క‌టించారు. గ‌డ్డ క‌ట్టే చ‌లికి కేరాఫ్ గా ఉన్న ల‌డ‌ఖ్ లో ఒక్క‌డే జాతీయ ప‌తాకంతో సోన‌మ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేప‌ట్టాడు. 

ఇదంతా కేవ‌లం ప్ర‌చారానికో లేక త‌న కోసమో చేయ‌డం లేదు. ఐదు రోజుల పాటు తాను నిర‌స‌న ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపాడు. సామాజిక మాధ్య‌మాల‌లో సోన‌మ్ వాంగ్ చుక్ వైర‌ల్ గా మారారు.

వ్యాపారం, వాణిజ్యం, మ‌తం దేశాన్ని క‌బ‌ళిస్తూ ఆధిప‌త్యం చెలాయిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో ల‌డ‌ఖ్ ను కాలుష్య కోర‌ల్లోంచి ర‌క్షించాల‌ని సోన‌మ్ వాంగ్ చుక్ దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని కోరారు. కానీ ప్ర‌చారం త‌ప్ప స‌మ‌స్య‌లు ప‌ట్ట‌ని మోడీ ప్ర‌భుత్వం వాంగ్ చుక్ ఆవేద‌న‌ను ప‌ట్టించు కోలేదు. ఆ వైపు చూడ‌లేదు. 

ఇక్క‌డ ప‌రిశ్ర‌మ‌లు కొలువు తీరాయ‌ని దీని వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ తింటోంద‌ని, మౌలిక వ‌స‌తులు ఏర్పాటు చేయ‌కుండా చేయ‌డం వ‌ల్ల రాను రాను హిమ‌నీ న‌దాలు అంత‌రించి పోయే ప్ర‌మాదం ఉందంటూ హెచ్చ‌రించాడు సోన‌మ్ వాంగ్ చుక్(Sonam Wangchuk) .

ప్ర‌ధాన‌మంత్రినే ప్ర‌శ్నిస్తున్న ఈ వాంగ్ చుక్ ఎవ‌రు అని అనుమానం రాక త‌ప్ప‌దు. ఒక ప‌ని చేస్తే త‌మ‌కు ఏం వ‌స్తుంద‌ని ఆశిస్తున్న వారికి భిన్నంగా

ప‌ర్యావ‌ర‌ణం కోసం ధిక్కార స్వ‌రాన్ని వినిపించారు.లెక్క‌లేన‌న్ని ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఆద్యుడు సోన‌మ్ వాంగ్ చుక్.

1966లో ఆల్చి స‌మీపంలోని ఉలేటోక్పోలో పుట్టాడు. చ‌దువు కునేందుకు వ‌స‌తి లేక 1977లో ఢిల్లీకి పారి పోయాడు. అలా క‌ష్ట‌ప‌డి ఇంజ‌నీర్ గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. 2011లో ఎర్త్ ఆర్కిటెక్చ‌ర్ ను అధ్య‌య‌నం చేసేందుకు ఫ్రాన్స్ కు వెళ్లాడు.

వాంగ్ చుక్ ఇంజ‌నీర్ మాత్ర‌మే కాదు , ఇన్నోవేట‌ర్ , విద్యా సంస్క‌ర‌ణ వాది. ఇందు కోసం విద్యార్థుల విద్య‌, సాంస్కృతిక ఉద్య‌మానికి శ్రీ‌కారం చుట్టాడు. 1993 నుండి 2005 దాకా వాంగ్ చుక్ ల‌డాగ్స్ మెలాంగ్ ప‌త్రిక‌కు ఎడిట‌ర్ గా ప‌ని చేశాడు.

ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కు స‌ల‌హాదారుడిగా ప‌ని చేశారు. 2025 లో ఎడ్యుకేష‌న్ అండ్ టూరిజంపై పాల‌సీని రూపొందించే బాధ్య‌త‌ను చేప‌ట్టారు. అనేక సంస్థ‌ల‌లో స‌భ్యుడిగా ఉన్నారు సోన‌మ్ వాంగ్ చుక్(Sonam Wangchuk) .

ఆయ‌న అమీర్ ఖాన్ న‌టించిన 3 ఇడియ‌ట్స్ లో పున్ సుఖ్ వాంగ్డు పాత్ర‌కు ప్రేర‌ణ‌గా నిలిచాడు. త‌న జీవిత‌మంతా ప‌ర్వ‌తాల‌లో క‌ఠిన మైన ప‌రిస్థితుల‌లో నివ‌సించే ప్ర‌జ‌ల జీవితాల‌కు గ‌ణ‌నీయ‌మైన స‌హ‌కారం అందించాడు. ల‌డ‌ఖ్, నేపాల్, సిక్కిం ల‌లో మ‌ట్టి భ‌వ‌నాల‌ను రూపొందించ‌డంలో సాయం చేస్తున్నాడు. 

2018లో రామ‌న్ మెగ‌సెసే అవార్డు పొందారు. ఐసీఏ పుర‌స్కారం, సోష‌ల్ ఎంట్ర‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయ‌ర్ , రోలెక్స్ అవార్డ్ , ఇంట‌ర్నేష‌న‌ల్ టెర్రా అవార్డుతో పాటు ప‌లు జాతీయ‌, అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు ల‌భించాయి. 

ఇక‌నైనా ల‌ఢ‌క్ త‌ర‌పున సోనమ్ వాంగ్ ఆవేద‌న‌ను అర్థం చేసుకుంటే బెట‌ర్.

Also Read : న‌న్ను హిందువు అని పిల‌వండి – గవ‌ర్న‌ర్

Leave A Reply

Your Email Id will not be published!