PM Modi Congratulate : టీమిండియా గెలుపు చిరస్మరణీయం
అండర్ 19 వరల్డ్ కప్ విజేత భారత్ కు కంగ్రాట్స్
PM Modi Congratulate : ఇంగ్లండ్ ను ఫైనల్ లో మట్టి కరిపించి అండర్ -19 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వరల్డ్ కప్ 2023 విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టును భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ(PM Modi Congratulate) అభినందనలతో ముంచెత్తారు. కలిసికట్టుగా శ్రమిస్తే ఎంతటి కష్టమైనా సులభంగా సాధించడం సాధ్యమేనని అమ్మాయిలు నిరూపించారని కితాబు ఇచ్చారు.
అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోను రాణించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా అభినందనలు తెలియ చేస్తున్నానని పేర్కొన్నారు మోదీ. ప్రధానమంత్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇలాంటి విజయాలు భారత దేశ ప్రజలను , ప్రత్యేకించి యువతులను ప్రభావితం చేస్తాయని ఇదే స్పూర్తితో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ.
ఇదిలా ఉండగా కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టిన టైటాస్ సాధు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైంది. దక్షిణాఫ్రికాలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి ఇంగ్లండ్ ను 7 వికెట్ల తేడాతో టీమిండియా ఓడించింది. ఈ సందర్భంగా మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేక విజయం సాధించినందుకు భారత జట్టుకు కంగ్రాట్స్ . వారి భవిష్యత్త ప్రయత్నాలకు జట్టుకు శుభాకాంక్షలు అని తెలిపారు. ఇదిలా ఉండగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా భారత జట్టుకు ప్రత్యేకంగా అభినందించారు. ఇదిలా ఉండగా విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు ఒక్కొక్కరికి బీసీసీఐ రూ లక్ష నజరానా ప్రకటించింది.
Also Read : వరల్డ్ కప్ విజేతకు రూ. 5 కోట్లు