Philips Layoffs : ఫిలిప్స్ లో భారీగా ఉద్యోగుల తొలగింపు
6,000 వేల మందిపై వేటు
Philips Layoffs : ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. ఐటీ, ఫార్మా, ఇ కామర్స్ , ఆయిల్ తదితర రంగాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే గూగుల్ , మైక్రోసాఫ్ట్ , ట్విట్టర్ , ఫేస్ బుక్ మెటా , ఐబీఎం, విప్రో సంస్థలతో పాటు ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా 18 వేల మందిని తొలగించింది.
ఈ ఏడాది ఇప్పటి వరకు 90 వేల మందికి పైగా వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు ఇంటి బాట పట్టారు. గూగుల్ మాత్రం మూడు నెలల వేతనాన్ని ముందుగానే చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. ఇంకోవైపు ట్విట్టర్ బాస్ మాత్రం తాను ఏదీ ఇవ్వనంటూ ప్రకటించాడు. విచిత్రం ఏమిటంటే ట్విట్టర్ ఆఫీసులకు అద్దెలు చెల్లించకుండా ఉండడంతో యజమానులు కోర్టును ఆశ్రయించారు.
ఈ తరుణలో కోర్టు మెట్లు ఎక్కనున్నాడు ఎలోన్ మస్క్. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ అయిన ఫిలిప్స్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు తమ సంస్థలో పని చేస్తున్న 6,000 వేల మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఉద్యోగులు లబోదిబో మంటున్నారు.
డచ్ హెల్త్ టెక్నాలజీ కంపెనీ ఫిలిప్స్(Philips Layoffs) లాభదాయకతను పునరుద్దరించేందుకు దాని శ్రామిక శక్తిని తగ్గించాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించింది ఫిలిప్స్ . అంతే కాకుండా మరో కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సగం ఉద్యోగాల కోత ఉంటుందని మిగిలిన సగం 2025 నాటికి ఉంటుందని కుండ బద్దలు కొట్టింది.
దీంతో కంపెనీలో పని చేస్తున్న వారు ఎవరికి మూడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
Also Read : ఐబీఎం షాక్ 6 వేల మందిపై వేటు