Shanti Bhushan : అలుపెరగని యోధుడు శాంతి భూషణ్
దేశం గర్వించదగిన మార్గదర్శకుడు
Shanti Bhushan : భారత దేశ న్యాయ వ్యవస్థలో కీలకమైన వ్యక్తిగా పేరొందిన శాంతి భూషణ్ మన మధ్య లేక పోవడం బాధకరం. చని పోయేంత వరకు ఆయన న్యాయ శాఖ మంత్రిగా కంటే న్యాయవాదిగా గుర్తండి పోయారు.
1973లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. ప్రజాస్వామ్య సంస్థలను, ప్రధానంగా న్యాయ వ్యవస్థను ఎలా కాపాడు కోవాలో తెలియ చేశారు. 1971లో సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధీ తన రాయ్ బరేలీ సీటును ఎన్నికల అవకతవకల ద్వారా గెలుపొందారని ఆరోపిస్తూ రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు.
ఆనాడు శాంతి భూషణ్ తన తరపున వాదించి కేసు గెలిచాడు. ఇందిరా గాంధీ అవినీతికి పాల్పడినట్లు హైకోర్టు దోషిగా ఆనాడు నిర్ధారించింది. దీంతో ఆమె పదవి నుంచి తొలగించబడింది. దీనికి ప్రధాన కారణం శాంతి భూషణ్(Shanti Bhushan).
ఆ తర్వాత ఆరు సంవత్సరాలపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇందిరా గాంధీ నిషేధానికి గురయ్యారు. న్యాయ పరమైన ఓటమి ఇందిర ఎమర్జెన్సీ ప్రకటనకు మార్గం సుగమం చేసింది. ఇందిర సర్కార్ తన స్వంత ఎంపికకు భారత ప్రధాన న్యాయమూర్తిని కలిగి ఉండేందుకు ప్రయత్నించింది.
చివరకు 1977లో ఆమె ప్రభుత్వం పతనానికి దారి తీసేలా చేసింది. 97 ఏళ్ల వయస్సులో ఆయన కాలం చేశారు.ఎమర్జెన్సీ రద్దు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఓడిపోయిన తర్వాత 1977 నుండి 1979 వరకు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా పని చేశారు శాంతి భూషణ్(Shanti Bhushan).
1980లో మొరార్జీ ప్రభుత్వం పతనం తర్వాత శాంతి భూషణ్ భారతీయ జనతా పార్టీ స్థాపనలో ఒకరిగా ఉన్నారు. 1986 వరకు పార్టీ జాతీయ కోశాదికారిగా కొనసాగారు. న్యాయ వ్యవస్థకు సంబంధించి జవాబుదారీతనంతో కూడిన కేసులను వాదించాడు. ఆయన జీవితం అంతా న్యాయాన్ని పరిరక్షించే దిశగా సాగింది.
1980 చివరలో శాంతి భూషణ్ , వీఎం తార్కుండే, ఫాలి నారిమన్ , అనిల్ దివాన్ వంటి వారితో కలిసి సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (సీపీఐఎల్) అనే ప్రభుత్వేతర సంస్థను స్థాపించారు శాంతి భూషణ్.
2జీ స్పెక్ట్రమ్ లైసెన్సుల రద్దు, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా పీజే థామస్ నియామకాన్ని రద్దు చేసేందుకు దారి తీసిన వాటితో సహా విజయవంతమైన పీఐఎల్ లను నిర్వహించింది. ఆయన కుమారుడు ప్రశాంత్ భూషణ్ కూడా ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు.
భారత న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం కోసం ఒత్తిడి చేయడానికి జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ (సీజేఏఆర్ ) కోసం ప్రచారం చేపట్టారు.
న్యాయ మూర్తుల నియామకాల్లో పారదర్శకత, న్యాయమూర్తులను విచారించేందుకు తగిన యంత్రాంగం,వారి ఆస్తులను పబ్లిక్ డొమైన్ లో ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సంస్థ పలు కేసులు దాఖలు చేసింది.
2009లో తెహల్కాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గత 16 మంది సీజేఐలలో సగం మంది అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇది ఇప్పటికీ సంచలనంగా మారింది.
ఏది ఏమైనా శాంతి భూషణ్(Shanti Bhushan) అలుపెరుగని యోధుడిగా ఎప్పటికీ గుర్తుండి పోతారు.
Also Read : మన్మోహన్ కు జీవిత సాఫల్య పురస్కారం