K Viswanath : కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇక లేరు
విషాదంలో తెలుగు సినిమా రంగం
K Viswanath : తెలుగు సినిమా రంగంలో విషాదం అలుముకుంది. దిగ్గజ దర్వకుడు కాశీనాథుని విశ్వనాథ్ కన్ను మూశారు. ఆయన వయస్సు 92 ఏళ్లు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా ఓ కళా ఖండం. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. సినిమాలను అద్భుతమైన రీతిలో చిత్రీకరించిన ఘనత కె. విశ్వనాథ్ కు(K Viswanath) దక్కుతుంది.
ఆయన తీసిన సినిమాలలో ప్రతి సినిమా గుర్తుంచు కోదగినదే. శంకరా భరణం , సాగర సంగమం, స్వాతి ముత్యం, సిరి వెన్నెల ఇలా ప్రతి సినామా ఓ అద్భుత దృశ్య కావ్యమే. కళా తపస్వి విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె. 1930 ఫిబ్రవరి 19న పుట్టారు. హిందూ కాలేజీలో ఇంటర్ చదివారు. ఆంధ్రా విశ్వ విద్యాలయంలో బీఎస్సీ పూర్తి చేశారు.
వాహినీ స్టూడియోలో సౌండ్ ఆర్టిస్టుగా తన సినీ కెరీర్ ను ప్రారంభించారు. సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, స్వయం కృషి , స్వర్ణ కమలం, సూత్ర ధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్ చిత్రాలకు ప్రాణం పోశారు కె. విశ్వనాథ్(K Viswanath). ఆయన దర్శకుడిగానే కాదు నటుడిగా కూడా గుర్తింపు పొందారు. శుభ సంకల్పంలో వెండి తెరపై కనిపించాచరు. వజ్రం, కలిసుందాం రా , నరసింహ నాయుడు, సీమ సింహం, నువ్వు లేక నేను లేను , సంతోషం , లాహిరి లాహిరి, ఠాగూర్ తదితర సినిమాల్లో నటించి మెప్పించారు.
ఆయన తొలి చిత్రం ఆత్మ గౌరవం . దీని ద్వారానే సినిమాకు పరిచయం అయ్యారు దర్శకుడిగా. ఈ చిత్రానికి ఉత్తమ సినిమా విభాగంలో కాంస్య బహుమతి అందుకున్నారు. చెల్లెలి కాపురం, శారదా, ఓ సీత కథ, జీవన జ్యోతి చిత్రాలకు నంది అవార్డులు లభించాయి. శంకరాభరణంకు జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది. ఇదే కాదు సప్తపది, స్వాతిముత్యం, సూత్ర ధారులు, స్వరాభిషేకం చిత్రాలకుకూడా జాతీయ అవార్డులు దక్కాయి. కె. విశ్వనాథ్ కు ఎన్నో అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
Also Read : దివికేగిన సినీ దిగ్గజం తీరని విషాదం