CM KCR Viswanath : దివికేగిన సినీ దిగ్గ‌జం తీర‌ని విషాదం

సీఎంలు కేసీఆర్, జ‌గ‌న్..మాజీ సీఎం చంద్ర‌బాబు

CM KCR Viswanath : తెలుగు సినిమా రంగం దిగ్గ‌జాన్నికోల్పోయింది. కె. విశ్వ‌నాథ్ లేర‌న్న వార్త న‌న్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. నాకు అత్యంత ఇష్ట‌మైన ద‌ర్శ‌కుల‌లో ఆయ‌న ఒక‌రు. సాగ‌ర సంగ‌మం, శంక‌రాభ‌ర‌ణం, సిరివెన్నెల, సిరి సిరి మువ్వ లాంటి ఎన్నో ఆణిముత్యాల‌ను అందించారు. భౌతికంగా ఆయ‌న లేర‌న్న వాస్త‌వాన్ని నేను జీర్ణించు కోలేక పోతున్నా. సినీ ద‌ర్శ‌కుడి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ దేవుడిని ప్రార్థిస్థున్నాన‌ని పేర్కొన్నారు సీఎం కేసీఆర్(CM KCR Viswanath).

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు కె.విశ్వ‌నాథ్ మ‌ర‌ణం తీర‌ని లోటు అన్నారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. క‌ళాత్మ‌క‌మైన చిత్రాల‌ను తీయ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి అని కొనియాడారు మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. కె. విశ్వ‌నాథ్ మ‌ర‌ణం ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు.

తెలుగు సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు పెద్ద‌పీట వేసిన ఘ‌న‌త ఆయ‌న‌దేన‌ని ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా కె. విశ్వ‌నాథ్ తో త‌మ‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సినిమా రంగానికి చెందిన ద‌ర్శ‌కులు, న‌టీ న‌టులు తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు.

ఇక సీఎం కేసీఆర్ కు ద‌ర్శ‌కుడు విశ్వ‌నాథ్ తో ప్ర‌త్యేక అనుబంధం ఉంది. ఆగ‌స్టు 12, 2021లో సీఎం స్వ‌యంగా ఆయ‌న ఇంటికి వెళ్లారు. ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తాను శంక‌రా భ‌ర‌ణం సినిమాను 25 సార్ల‌కు పైగా చూశాన‌ని చెప్పారు సీఎం కేసీఆర్.(CM KCR Viswanath) మంచి సందేశాత్మ‌క సినిమా తీస్తానంటే తాను నిర్మించేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు కేసీఆర్. కానీ ఆయ‌న కోరిక తీర‌కుండానే వెళ్లి పోయారు దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు.

Also Read : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు క‌ళాత‌ప‌స్వి

Leave A Reply

Your Email Id will not be published!