YS Jagan K Viswanath : కళాతపస్వి మరణం బాధాకరం – జగన్
సినిమా రంగానికి తీరని లోటు
YS Jagan K Viswanath : దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆయన తీసిన ప్రతి చిత్రం ఓ కళా ఖండం అని పేర్కొన్నారు. ఆయన కలకాలం బతికే ఉంటారని పేర్కొన్నారు. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోతారని కొనియాడారు. చిత్ర రంగానికి కె. విశ్వనాథ్ చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు ఏపీ సీఎం.
కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ (YS Jagan K Viswanath) మరణం తనను బాధకు గురి చేసిందని అన్నారు జగన్ రెడ్డి. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం అని ప్రశంసించారు.
ఆయన దర్శకత్వంలో రూపు దిద్దుకున్న చిత్రాలు తెలుగు సినిమా రంగానికి ఎనలేని పేరు తీసుకు వచ్చేలా చేశాయని పేర్కొన్నారు. విశ్వనాథ్ ఔన్నత్యం ప్రతి ఒక్కరికీ ఆదర్శ ప్రాయంగా ఉంటుందన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపారు.
విశ్వనాథ్ చిత్రాలు కూడా నేను చూశాను. అవి నన్ను ఇప్పటికీ మరిచి పోలేకుండా చేశాయని ప్రశంసించారు సీఎం. కళా హృదయం కలిగిన మహోన్నత దర్శకుడు అని ప్రశంసించారు. కె. విశ్వనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఇదిలా ఉండగా కళాపతస్విని ఎన్నో అవార్డులు , పురస్కారాలు వరించాయి. 2017లో దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయననను ఘనంగా సత్కరించింది. 1992లో పద్మశ్రీ అవార్డు దక్కింది.
Also Read : దివికేగిన సినీ దిగ్గజం తీరని విషాదం