Brahmanandam Viswanath : సినీ లోకానికి తీరని లోటు
కళాతపస్వి లేక పోవడం బాధాకరం
Brahmanandam Viswanath : తెలుగు సినిమా రంగానికి తీరని లోటు కళాతపస్వి లేక పోవడం. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒకటా రెండా ఎన్నో సినిమాలకు ప్రాణం పోశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు జీవం పోసిన ఘనత కె. విశ్వనాథ్ దేనని కొనియాడారు దిగ్గజ నటుడు బ్రహ్మానందం(Brahmanandam Viswanath). ఆయన లేరన్న విషయం జీర్ణించుకోలేక పోతున్నానని పేర్కొన్నారు. నివాసంలో కె. విశ్వనాథ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు బ్రహ్మానందం. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ప్రతి సినిమా అద్భుతం. అంతుకు మించిన కళాఖండం. నాలాంటి వారికే కాదు కళా రంగానికి చెందిన ప్రతి ఒక్కరికీ ఆదర్శ ప్రాయుడు. ఎందుకంటే ఇవాళ పేరొందిన నటీ నటులు ఆయన చిత్రాలలో నటించిన వారే. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో నటించేందుకు పోటీ పడ్డారు. ప్రతి నిమిషం సినిమాకు సంబంధించి ఆలోచించారు. దానినే శ్వాసగా మార్చుకున్నారు. అలాంగి గొప్ప దర్శకుడు భౌతికంగా లేక పోవడం తనను విస్మయానికి గురి చేసిందన్నారు బ్రహ్మానందం.
ఇదిలా ఉండగా కళాపతస్విని ఎన్నో అవార్డులు , పురస్కారాలు వరించాయి. 2017లో దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయననను ఘనంగా సత్కరించింది. 1992లో పద్మశ్రీ అవార్డు దక్కింది.
కె. విశ్వనాథ్ స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా రేపల్లె. ఆయన వయస్సు 92 ఏళ్లు. తన జీవితాన్ని సౌండ్ రికార్డిస్ట్ గా ప్రారంభించారు. కొంత కాలం సహాయ దర్శకుడిగా పని చేశారు. 1961లో ఆత్మ గౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆయన కుల వ్యవస్థ, వైకల్యం, అంటరానితనం, లింగ వివక్ష, వరకట్నం, సామాజిక ఆర్థిక సవాళ్లు వంటి ఇతివృత్తాలతో 50 కి పైగా తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
Also Read : తండ్రిని కోల్పోయాను – చిరంజీవి