SS Rajamouli K Viswanath : ఎల్ల‌కాలం రుణ‌ప‌డి ఉంటాం

క‌ళాత‌ప‌స్వి మ‌ర‌ణం బాధాక‌రం

SS Rajamouli K Viswanath : మాలాంటి ద‌ర్శ‌కుల‌కు క‌ళాత‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ మార్గ‌ద‌ర్శ‌కుడు. సినిమా ఉన్నంత కాలం ఆయ‌న బ‌తికే ఉంటార‌ని కొనియాడారు..నివాళులు అర్పించారు దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజమౌళి. మీకు ఎల్ల‌కాలం రుణ‌ప‌డి ఉంటామ‌ని పేర్కొన్నారు. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు క‌న్ను మూయ‌డం బాధాక‌రం. ఆయ‌న తీసిన ప్ర‌తి చిత్రం ఓ పుస్త‌క‌మ‌ని ప్ర‌శంసించారు రాజమౌళి(SS Rajamouli).

తెలుగు సినిమా చూసిన గొప్ప ప్ర‌తిభావంతుల‌లో కె. విశ్వ‌నాథ్ ఒక‌రు అని పేర్కొన్నారు. ఆయ‌న పార్థివ దేహాన్ని సంద‌ర్శించారు. త‌న సినిమాల ద్వారా అంద‌రికీ నేర్పించిన దానికి తాను ఆయ‌న‌కు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాన‌ని తెలిపారు.

ప్ర‌పంచంలో ఎవ‌రైనా మీ తెలుగు సినిమా గొప్ప‌ద‌నం ఏమిటి అని అడిగితే మాకు కె. విశ్వనాథ్ అఉన్నార‌ని గ‌ర్వంగా చెప్పుకుంటామ‌న్నారు ఎస్ఎస్ రాజ‌మౌళి. సాధారణంగా తెలుగు సినిమా, క‌ళ‌పై మీ సంత‌కం త‌ప్ప‌క ఉంటుంద‌న్నారు. మీరందించిన సినిమాలు ఎప్ప‌టికీ నిలిచే ఉంటాయ‌ని కొనియాడారు. మ‌రో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

భార‌త దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడు కె. విశ్వ‌నాథ్ అని పేర్కొన్నారు. ఆయ‌న మ‌ర‌ణించార‌న్న వార్త వినేందుకు చాలా బాధ‌గా ఉంద‌న్నారు ఆర్జీవీ. ఆయ‌న వెళ్లి పోయారు. కానీ క‌ళాత‌ప‌స్వి చేసిన సినిమాలు ఎప్ప‌టికీ జీవించి ఉంటాయ‌ని పేర్కొన్నారు.

కె. విశ్వనాథ్ స్వ‌స్థ‌లం ఆంధ్ర ప్ర‌దేశ్ లోని గుంటూరు జిల్లా రేప‌ల్లె. ఆయ‌న వ‌య‌స్సు 92 ఏళ్లు. త‌న జీవితాన్ని సౌండ్ రికార్డిస్ట్ గా ప్రారంభించారు. కొంత కాలం స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌ని చేశారు. 1961లో ఆత్మ గౌర‌వం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు.

ఆయ‌న కుల వ్య‌వ‌స్థ‌, వైక‌ల్యం, అంట‌రానిత‌నం, లింగ వివ‌క్ష‌, వ‌ర‌క‌ట్నం, సామాజిక ఆర్థిక స‌వాళ్లు వంటి ఇతివృత్తాల‌తో 50 కి పైగా తెలుగు, హిందీ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Also Read : తండ్రిని కోల్పోయాను – చిరంజీవి

Leave A Reply

Your Email Id will not be published!