BJP Protest AAP : కేజ్రీవాల్ రాజీనామా చేయలి – బీజేపీ
ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన
BJP Protest AAP : దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కలకలం రేపుతోంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితతో పాటు తాజాగా రెండోసారి సమర్పించిన ఛార్జ్ షీట్ లో ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును కూడా చేర్చింది. దీంతో భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగింది(BJP Protest AAP).
శనివారం ఢిల్లీ సీఎం రాజీనామా చేయాలంటూ ఆందోళన బాట పట్టింది. బీజేపీ ఆధ్వర్యంలో దేశ రాజధానిలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ఏడాది గోవాలో జరిగిన ఆప్ ఎన్నికల ప్రచారానికి మద్యం వ్యాపారం వ్యవహారంలో నిధులు అక్రమంగా వాడారంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
దీనిని కొట్టి పారేశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. కేంద్రం కావాలని తనను ఇరికించాలని చూస్తోందని మండిపడ్డారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక చవకబారు , నిరాధార ఆరోపణలు చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు నిరసనకు దిగారు.
దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. లిక్కర్ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉందని ఈడీ ఆరోపించిందని వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీ స్కాకు సంబంధించి ఐదుగురు వ్యక్తులు, ఏడు కంపెనీలపై సప్లిమెంటరీ ఛార్జి షీట్ ను కోర్టు గురువారం ఆమోదించింది.
Also Read : ‘ఉపా’ చట్టంపై శశి థరూర్ ఫైర్