PM Modi Inaugurate : హెలికాప్ట‌ర్ ఉత్ప‌త్తి ప‌రిశ్ర‌మ‌కు శ్రీ‌కారం

6న ప్రారంభించ‌నున్న‌పీఎం న‌రేంద్ర మోదీ

PM Modi Inaugurate : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ఫిబ్ర‌వ‌రి 6న క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా భార‌త దేశంలోనే అతి పెద్ద హెలికాప్ట‌ర్ ఉత్ప‌త్తి సౌక‌ర్యాన్ని ప్రారంభించ‌నున్నారు(PM Modi Inaugurate). ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధానితో పాటు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , మంత్రిత్వ శాఖ‌లోని ఉన్న‌తాధికారులు కూడా పాల్గొంటారు.

క‌ర్ణాట‌క లోని తుమ‌కూరులో ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఏరో స్పేస్ బెహ‌మోత్ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) గ్రీన్ ఫీల్డ్ హెలికాప్ట‌ర్ ఉత్ప‌త్తి కేంద్రాన్ని ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించనున్నారు.

రక్ష‌ణ మంత్రిత్వ శాఖ 615 ఎక‌రాల ఫ్యాక్ట‌రీని భార‌త దేశ‌పు అతి పెద్ద హెలికాప్ట‌ర్ త‌యారీ సౌక‌ర్యంగా త‌యారు చేస్తుంది. మూడు నుంచి 15 ట‌న్నుల శ్రేణిలో 1,000 కంటే ఎక్కువ హెలికాప్ట‌ర్ల‌ను ఉత్ప‌త్తి చేయాల‌ని హెచ్ఏఎల్ యోచిస్తోంద‌ని , 20 ఏళ్ల కాలంలో మొత్తం రూ. 4 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా వ్యాపారం జ‌రుగుతుంద‌ని పీఎంఓ తెలిపింది.

తేలిక‌పాటి యుద్ద హెలికాప్ట‌ర్లు , ఇండియ‌న్ మ‌ల్టీ రోల్ హెలికాప్ట‌ర్లు వంటి ఇత‌ర హెలికాప్ట‌ర్ల‌ను ఉత్ప‌త్తి చేసేందుకు వీలు క‌లుగుతుంది. భ‌విష్య‌త్తులో ఎల్సీహెచ్ లు, సివిల్ అడ్వాన్స్ డ్ లైట్ హెలికాప్ట‌ర్లు , ఐఎంఆర్హెచ్ ల నిర్వ‌హ‌ణ , మ‌ర‌మ్మ‌తు కోసం కూడా దీనిని ఉప‌యోగించ‌నున్న‌ట్లు పేర్కొంది.

బెంగ‌ళూరునుండి 70 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న తుమకూరు ఫ్యాక్ట‌రీ నుండి సివిల్ లైట్ యుటిలిటీ హెలికాప్ట‌ర్ల కు సంబంధించి ఎగుమ‌తులు కూడా ఉండ‌నున్నాయి. ఆత్మ నిర్భ‌ర్ భారత్ లో భాగంగా 6న క తుమ‌కూరులో హెలికాప్ట‌ర్ ఫ్యాక్ట‌రీని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.

Also Read : హిల్ల‌రీ క్లింట‌న్ గుజ‌రాత్ టూర్

Leave A Reply

Your Email Id will not be published!