Hillary Clinton Ela Bhatt : హిల్ల‌రీ క్లింట‌న్ గుజ‌రాత్ టూర్

ఎలా భ‌ట్ కు నివాళి

Hillary Clinton Ela Bhatt : అమెరికాకు చెందిన హిల్ల‌రీ క్లింట‌న్ ఆదివారం గుజ‌రాత్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆమె రెండు రోజుల పాటు వివిధ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటారు. హిల్ల‌రీ క్లింట‌న్ అహ్మ‌దాబాద్ లో ఎలా భ‌ట్ కు(Hillary Clinton Ela Bhatt) నివాళులు అర్పించ‌నున్నారు. సేవా స‌భ్యుల‌తో సంభాషించ‌నున్నారు. సేవా సంస్థ‌ను స్థాపించారు ఎలా భ‌ట్. హిల్ల‌రీ క్లింట‌న్ , ఎలా భ‌ట్ ఇద్ద‌రికీ 1995 సంవ‌త్స‌రం నుంచి ప‌రిచ‌యం ఉంది.

ఇదిలా ఉండ‌గా హిల్ల‌రీ క్లింట‌న్ మాజీ అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా ప‌నిచేశారు. గ‌త ఏడాది 2022 న‌వంబ‌ర్ లో ఎలా భ‌ట్ మ‌ర‌ణించారు. సామాజిక కార్య‌క‌ర్త‌గా గుర్తింపు పొందారు. సేవా సంస్థ పూర్తిగా స్వ‌యం సాధికారిత గ‌ల మ‌హిళా సంఘం. ఎన్నో సామాజిక కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది. పేద‌లు, సామాన్యుల‌కు అండ‌గా నిలిచింది ఈ సేవా సంస్థ‌.

ఆదివారం హిల్ల‌రీ క్లింట‌న్ నివాళులు అర్పించిన అనంత‌రం సేవా స‌భ్యుల‌తో ప్ర‌త్యేకంగా సంభాషిస్తారు. సేవా గ్రామీణ చొరవ , దాని ప్రోగ్రామ్ కో ఆర్డినేష‌న్ లో భాగంగా పాన్ కార్మికుల‌తో కూడా మాట్లాడ‌తారు హిల్ల‌రీ క్లింట‌న్ . గుజ‌రాత్ లోని సురేంద్ర న‌గ‌ర్ జిల్లా లోని ధృంగాధ్ర‌ను కూడా సంద‌ర్శించ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 2.45 నుంచి సాయంత్రం 4 గంట‌ల దాకా సంద‌ర్శిస్తారు. రిసెప్షన్ సెంట‌ర్ లో కూడా ప్ర‌సంగిస్తారు. ఆమె నాటిన మ‌ర్రి చెట్టు ద‌గ్గ‌ర ఒక ఫ‌ల‌కాన్నిఆవిష్క‌రిస్తారు.

ఇదిలా ఉండ‌గా ఎలా భ‌ట్ సామాజికంగా చేసిన సేవ‌ల‌ను కొనియాడారు హిల్ల‌రీ క్లింట‌న్. ఇలాంటి వాళ్ల వ‌ళ్ల‌నే ఈ ప్రపంచంలో ఇంకా మాన‌వ‌త్వం బ‌తికే ఉంద‌ని పేర్కొన్నారు.

Also Read : ప్ర‌తిప‌క్షం అవ‌మానం ఠాకూర్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!