Chinna Jeeyar Swamy : భ‌క్త బాంధ‌వుడు నారాయ‌ణుడు

శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి

Chinna Jeeyar Swamy : లోక క‌ళ్యాణం కోసం స‌మ‌స్త మాన‌వులంతా సుఖ సంతోషాల‌తో విల‌సిల్లేలా ప్ర‌య‌త్నం చేస్తున్న ఆధ్యాత్మిక గురువుల‌లో ఒక‌రిగా గుర్తింపు పొందారు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి. ల‌లిత‌మైన ప‌దాల‌తో వేదాల సారాన్ని, పురాణాల‌ను, ఇతి హాసాల విశిష్ట‌త‌ను కొన్నేళ్లుగా ప‌రిచ‌యం చేస్తూ వ‌స్తున్నారు. స‌మ‌స్త మాన‌వాళిని భ‌క్తి వైపు మ‌ళ్లేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. 

ఇటీవ‌ల శంషాబాద్ లోని ముచ్చింత‌ల దేశ వ్యాప్తంగా పేరు పొందింది. ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇదంతా శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి(Chinna Jeeyar Swamy) వారి వ‌ల్ల‌నే జ‌రిగింది. దివ్య సాకేతం భ‌క్త బాంధ‌వుల‌కు పుణ్య క్షేత్రంగా మారింది. మాన‌వులంతా స‌మానులేన‌న్న భ‌గ‌వ‌త్ రామానుజాచార్యుల ప‌రంప‌ర‌ను ముందుకు తీసుకు వెళుతున్నారు స్వామి. 

ఓ వైపు పాఠ‌శాలలు ఇంకో వైపు యాగ శాల‌లు దేదీప్య మానంగా వెలుగుతున్నాయి. వెలుతురు పంచుతున్నాయి. వేద విజ్ఞానం జీవ‌న ప్ర‌స్థానంలో అత్యంత అవ‌స‌రమ‌ని గుర్తించారు. అందుకే నీతి, ధ‌ర్మం, స‌త్యం, నిష్ట‌త‌, భ‌క్తిని క‌లిగి ఉండేలా చేయ‌డంలో కృషి చేస్తున్నారు.

నిత్యం శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి వారు ఇచ్చే తీర్థ గోష్టికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. స్వామి వారు ప‌విత్ర‌మైన చేతుల మీదుగా ఇచ్చే పుణ్య తీర్థం కోసం భ‌క్తులు వేచి ఉంటారు. ఎంతో ఓపిక‌తో వారిని దీవిస్తారు..ఆశీర్వ‌చ‌నాలు అంద‌జేస్తారు.

భార‌త దేశ సంస్కృతి సాంప్ర‌దాయాన్ని, దేశ విశిష్ట‌త‌ను త‌న వాగ్ధాటితో ప్ర‌పంచాన్ని నివ్వెర పోయేలా చేశారు ఆనాడు స్వామి వివేకానందుడు. ఇవాళ శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి(Chinna Jeeyar Swamy) సైతం ప్ర‌తి ఒక్క‌రినీ ప్రేమ‌తో పిలుస్తారు..క‌రుణ‌తో లాలిస్తారు.. చూపుల‌తోనే భ‌క్తిని ప్ర‌స‌రింప చేస్తారు..అందుకే ఆయ‌న భ‌క్త బాంధ‌వులారా అని సంభోదిస్తారు.

ఆ చ‌ల్ల‌ని చూపు ఎంద‌రినో చైత‌న్య‌వంతుల్ని చేస్తుంది. భ‌క్తి మార్గం వైపు మళ్లేలా చేస్తుంది. అందుకే భ‌క్తులంతా శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి వారిని భ‌క్త బాంధ‌వుడ‌ని న‌డిచే నారాయ‌ణుడ‌ని భావిస్తారు..కొలుస్తారు..జై శ్రీ‌మ‌న్నారాయ‌ణ‌.

Also Read : దివ్య సాకేతం వ‌సంతోత్స‌వం

Leave A Reply

Your Email Id will not be published!