YS Sharmila : రాజ‌న్న రాజ్యం కోసం పోరాటం

సీఎం కేసీఆర్ పై ఆగ్ర‌హం

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌జా ప్ర‌స్థానం పేరుతో ఆమె పాద‌యాత్ర కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో కొలువు తీరిన కేసీఆర్ పాల‌నపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర బ‌డ్జెట్ లో చోటు లేకుండా పోయింద‌ని ఆరోపించారు వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila).

తెలంగాణ పేరుతో రాష్ట్రంలో అందినంత మేర దోచుకున్నాడ‌ని ఆరోపించారు. రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నా ఎందుకు స్పందించ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు. రాజ‌న్న రాజ్యం వ‌చ్చేంత వ‌ర‌కు తాను పోరాడుతూనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రికీ త‌ల‌వంచే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. త‌మ పార్టీ రాబోయే ఎన్నిక‌ల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదన్నారు. తాము ప్ర‌జా స‌మ‌స్య‌ల కోసం పోరాడుతున్నామ‌ని కానీ అధికార పార్టీకి చెందిన నాయ‌కులు దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు వైఎస్ ష‌ర్మిల‌.

రాబోయే ఎన్నిక‌ల్లో తాము గెల‌వ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఇక రాష్ట్రంలో రాజ‌న్న రాజ్యం మ‌రోసారి రాక త‌ప్ప‌ద‌న్నారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం అన్న‌ది లేద‌ని మండిప‌డ్డారు. కేవ‌లం అధికార‌పక్షం మాత్ర‌మే కొలువు తీరింద‌ని , తాను ఆడిందే ఆట పాడిందే పాట అన్న‌ట్టుగా సీఎం కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila).

మ‌స‌క బారిన బ‌తుకుల్లో వెలుగులు నింపేందుకే ఈ ప్ర‌జా ప్ర‌స్థానం పాద‌యాత్ర చేప‌ట్టాన‌ని చెప్పారు వైఎస్సార్ టీపీ చీఫ్‌. ప్ర‌తి ఒక్క‌రికీ సంక్షేమ ఫ‌లాలు అందేంత వ‌ర‌కు తాను విశ్ర‌మించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

Also Read : సీఎం కేసీఆర్ పై కేసు పెట్టాలి – ఆర్ఎస్పీ

Leave A Reply

Your Email Id will not be published!