YS Sharmila : శ్రీహరి..రాజయ్యపై షర్మిల ఫైర్
ఇద్దరూ దళితులకు చేసింది ఏమీ లేదు
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తాటికొండ రాజయ్యను , మాజీ డిప్యూటీ సీఎం కడియంను ఏకి పారేశారు. ఇద్దరూ దళిత నాయకులై ఉండి దళితులకు ఏం చేశారంటూ ప్రశ్నించారు. ఒకరికి రాసలీల రాజయ్య అని పేరుందని , ఇంకొకరికి ఎన్ కౌంటర్ల ను ప్రోత్సహించారన్న ఆరోపణలు ఉన్నాయని వీరిని ఎన్నుకుని ఏం చేస్తున్నారంటూ నిలదీశారు.
వీరి వల్ల ఏమైనా అభివృద్ది జరిగిందా అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల(YS Sharmila). ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప ప్రజల సమస్యలను పరిష్కారించాలన్న ధ్యాసే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. వారికి తమను తాము బాగు పర్చుకోవడంలో ఉన్నంత శ్రద్ద ప్రజలపై , నియోజకవర్గాలపై, జిల్లా ప్రేమ ఇసుమంత కూడా లేదన్నారు.
ఇలాంటి వాళ్లను ఎన్నుకుంటే రాబోయే రోజుల్లో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు షర్మిల. కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకి అని కడియం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని అన్నారు. నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కాలేజీ నిర్మించినందుకు వ్యతిరేకా లక్షా 50 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చినందుకు వ్యతిరేకా , 30 వేల ఇళ్లు ఇచ్చినందుకు వ్యతిరేకా మీరే చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.
చవకబారు మాటలు మాట్లాడటం మానేసి కనీసం ప్రజల పట్ల ప్రేమనైనా కలిగి ఉండాలని సూచించారు వైఎస్సార్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల.
Also Read : ప్రగతి భవన్ కూల్చేస్తే శని పోతుంది