Womens T20 World Cup South Africa : కప్ పై సఫారీ ఫోకస్
స్వదేశంలో ఆడటం అడ్వాంటేజ్
Womens T20 World Cup South Africa : టీ20 మహిళా వరల్డ్ కప్ మెగా టోర్నీలో సత్తా చాటేందుకు సై అంటోంది సఫారీ మహిళా జట్టు. ఇప్పటికే ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది. ప్రధానంగా మిగతా జట్ల కంటే తమ దేశంలోనే టోర్నీ జరగనుండడం ఆ జట్టుకు ప్రధానంగా మేలు చేకూరనుంది.
స్వంత మైదానంలో ఇప్పటికే ఆడిన అనుభవం అదనపు బలంగా భావిస్తోంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొనున్నాయి. రెండు గ్రూప్ లలో 5 జట్ల చొప్పున ఆడతాయి. ఈనెల 10న ప్రారంభమై 26న ముగుస్తుంది. అదే రోజు ఫైనల్ మ్యాచ్ కొనసాగనుంది.
ఒకవేళ ఏదైనా అంతరాయం ఏర్పడితే రిజర్వ్ డే గా 27ను చేర్చింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) . ఫస్ట్ , సెకండ్ సెమీస్ ఉంటాయి. రిజర్వ్ డే లు కూడా ఏర్పాటు చేసింది ఐసీసీ. కేప్ టౌన్ ,పార్ల్ ,గ్కే బెర్హా స్టేడియంలలో మెగా టోర్నీ మ్యాచ్ లు కొనసాగుతాయి.
ఇక విమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టు (Womens T20 World Cup South Africa) ఇలా ఉంది. సునే లూయస్ కెప్టెన్ కాగా , లారా గూడాల్, అయాబొంగా ఖాకా, క్లో ట్రయాన్, అన్నరీ డెర్క్‌సెన్, మారిజానే కాప్, నాడిన్ డి క్లెర్క్, షబ్నిమ్ ఇస్మాయిల్, తజ్మిన్ బ్రిట్స్, లారా వోల్వార్డ్ట్, సినాలో జాఫ్తా, మసాబాటా క్లాస్, నాన్‌కులులేకో టి మ్లాబా, డి అనెల్కా, డి. ఆండ్రూస్, టెబోగో మచెకే మరియు తుమీ సెఖుఖునే.
భారీ ఎత్తున సఫారీ జట్టు ప్రాక్టీస్ లో నిమగ్నమై ఉంది. స్వదేశంలో రాణించి సత్తా చాటేందుకు సై అంటోంది.
Also Read : శ్రీలంక రాణిస్తుందా