Womens T20 World Cup Pakistan : జోరు మీదున్న పాకిస్తాన్
యుద్దానికి సిద్దమంటున్న టీమ్
Womens T20 World Cup Pakistan : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అక్కడ ప్రభుత్వం మారింది. దీంతో పీసీబీ చైర్మన్ గా ఉన్న మాజీ క్రికెటర్ రమీజ్ రజా తప్పుకున్నాడు. ఆయన స్థానంలో పీఎం నజామ్ సేథీని నియమించారు. కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు.
ఇదే సమయంలో క్రికెట్ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మహిళా క్రికెట్ కు మరింత సపోర్ట్ గా ఉంటున్నారు. ఇక పాకిస్తాన్ లో మహిళా క్రికెట్ కు భారీగానే ఆదరణ ఉంది. ఇక తటస్థ వేదికగా దాయాదులైన భారత్ , పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
అటు పురుషులైనా లేదా ఇటు మహిళలైనా ఇరు జట్లు తలపడుతున్నాయంటే ఓ యుద్దం జరుగుతున్నంత ఉత్కంఠ నెలకొంటుంది. ఈ తరుణంలో దక్షిణాఫ్రికా వేదికగా ఫిబ్రవరి 10 నుంచి ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్(Womens T20 World Cup Pakistan) ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. 26న ఫైనల్ జరుగుతుంది. ఐసీసీ రిజర్వ్ డే కూడా ప్రకటించింది. ఈ తరుణంలో పాకిస్తాన్ సత్తా చాటుతుందా లేక చతికిల పడనుందా అన్నది మైదానంలోకి దిగితేనే కానీ తెలియదు.
ఇక టీ20 మహిళా వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు ఇలా ఉంది. ఒమైమా సోహైల్, బిస్మా మరూఫ్, సాదియా ఇక్బాల్, సిద్రా అమీన్, సిద్రా నవాజ్, తుబా హసన్, గులాం ఫాతిమా, కైనత్ ఇంతియాజ్, ఐమెన్ అన్వర్, అలియా రియాజ్, అయేషా నసీమ్, సదాఫ్ షమాస్, ఫాతిమా సనా, జవేరియా ఖాన్, మునీబా అలీ, మరియు నస్హ్రా సందు ఆడనునున్నారు.
Also Read : టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా