Womens T20 World Cup West Indies : విండీస్ బిగ్ ఫైట్ కు సై
పటిష్ట స్థితిలో జట్టు
Womens T20 World Cup West Indies : ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ పై ఆశలు పెట్టుకుంది వెస్టిండీస్ . ఇప్పటికే పురుషుల జట్టు ఆశించిన మేర రాణించడం లేదు. ఈ తరుణంలో విండీస్ క్రికెట్ బోర్డు మహిళలైనా సత్తా చాటుతారని నమ్ముతోంది. ఒక రకంగా ఎక్కువగా విశ్వసిస్తోంది. కానీ బలమైన జట్లుగా ఇప్పటికే పేరు పొందారు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు.
వాటితో పాటు భారత జట్టును కూడా తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదు. ఈ తరుణంలో కనీసం సెమీస్ కు చేరాలంటే విండీస్ మహిళా జట్టు పెద్గా కష్ట పడాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు జట్టులో కీలక మార్పులు కూడా చేసింది విండీస్ బోర్డు.
ఇక టోర్నీ విషయానికి వస్తే ఫిబ్రవరి 10 నుంచి 26 దాకా కొనసాగుతుంది. మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. రెండు గ్రూప్ లలో 5 జట్ల చొప్పున ఆడతాయి. ఫైనల్ మ్యాచ్ తో టోర్నీ పూర్తవుతుంది.
మరో వైపు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తొలిసారిగా విమెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తోంది. ఈ టోర్నీ ముగిసిన వెంటనే అది స్టార్ట్ అవుతుంది. ఇక ఈ జట్టులోని కొందరు ఆటగాళ్లు కూడా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ తరుణంలో ఈ మెగా టోర్నీలో ఆడితే వారికి అదనపు బలం చేకూరినట్లు అవుతుంది.
ఇక ఐసీసీ టీ20 వరల్డ్ కప్(Womens T20 World Cup West Indies) లో ఆడే వెస్టిండీస్ జట్టు ఇలా ఉంది. హేలీ మాథ్యూస్, షెమైన్ కాంప్‌బెల్లే, ఆలియా అలీన్, చినెల్లే హెన్రీ, త్రిషాన్ హోల్డర్, షామిలియా కన్నెల్, అఫీ ఫ్లెచర్, షబికా గజ్నాబి, జైదా జేమ్స్, కరిష్మా రామ్‌హారక్, షకేరా సెల్మాన్, జెనాబా జోసెఫ్, చెడియన్ నేషన్, స్టెఫానీ తైడాలర్, స్టాఫనీ తైడాలర్.
Also Read : న్యూజిలాండ్ సత్తా చాటేనా