P Susheela SP Balu : పాట ప‌దిలం బాలు జ్ఞాప‌కం – సుశీల

చిత్ర ప‌రిశ్ర‌మ చీక‌టై పోయింది

P Susheela SP Balu : పి. సుశీల దివంగ‌త పండితారాధ్యుల బాల‌సుబ్ర‌మ‌ణ్యం (ఎస్పీబీ) గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇద్ద‌రం క‌లిసి ఎన్నో పాట‌లు పాడాం. కానీ ప్ర‌తి రోజూ బాలు గుర్తుకు వ‌స్తూనే ఉన్నాడు. అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన సాంగ్స్ ల‌లో మా ఇద్ద‌రివి చాలానే ఉన్నాయి. ఆనాటి రోజులు వేరు. కానీ ఇప్పుడు వేరు. టెక్నాల‌జీ మారింది. దాంతో పాటే ఎవ‌రు పాడుతున్నారో తెలియ‌డం లేదు. అయితే అప్పుడున్నంత క‌ష్టం, శ్ర‌మ ఇప్పుడు లేద‌ని పేర్కొంది సుశీల(P Susheela SP Balu) .

బాలుతో పాడుతూ ఉంటే మైమ‌రిచి పోయేదానిని. ఎందుకంటే అత‌డి వాయిస్ లో మాధుర్యం ఉంది. అంత‌కు మించిన స‌మ్మోహ‌న శ‌క్తి ఉంది. ఒక ర‌కంగా చెప్పాలంటే మా బాలు బంగారం..అంత‌కు మించిన మ‌హానుభావుడు.

రికార్డింగ్ థియేట‌ర్ లో స‌ర‌దాగా ఉండేవాడు. ఎప్పుడూ సంతోషంగా ఉంటూ న‌వ్వుతూ నవ్విస్తూ వాతావ‌ర‌ణాన్ని అత్యంత ఆహ్లాద‌క‌రంగా మార్చేవాడంటూ ఎస్పీబీ గురించి గుర్తు చేసుకున్నారు పి. సుశీల‌. బాలు లేని లోటు ఇప్పుడు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌న్నారు. నాతోనే కాదు చిన్న వారైనా పెద్ద వారైనా ప్ర‌తి ఒక్క‌రితో అలాగే ఉండేవాడంటూ ప్ర‌శంసించారు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం గురించి. ఇప్ప‌టికీ నేను బాలు పాడిన పాట‌లు వింటూ ఉంటాను. దేవుడు తొంద‌ర‌గా తీసుకు పోతాడ‌ని అనుకోలేదు. 

బాలు సాంగ్స్ వింటూ ఉంటే ఇంకో ప‌దేళ్లు ఉండ కూడ‌దా అని అనిపిస్తుంద‌ని పేర్కొంది పి.సుశీల‌. బాలును త‌లుచుకున్న‌ప్పుడల్లా జీవితం బోర్ గా అనిపిస్తోంద‌ని వాపోయింది సుశీల‌మ్మ‌.

Also Read : కేజీఎఫ్‌-2 రికార్డ్ ప‌ఠాన్ బ్రేక్

Leave A Reply

Your Email Id will not be published!