Mark Wagh kohli : కోహ్లీ ఆట తీరుపై మార్క్ వా కామెంట్స్

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్..కామెంటేట‌ర్

Mark Wagh kohli : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ , ప్ర‌ముఖ కామెంటేట‌ర్ మార్క్ వా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్ర‌ధానంగా భార‌త మాజీ కెప్టెన్ , ర‌న్ మెషీన్ గా పేరొందిన విరాట్ కోహ్లీపై నిప్పులు చెరిగాడు. త‌న మొత్తం కెరీర్ లో సూప‌ర్ ఫీల్డ‌ర్ గా గుర్తింపు పొందాడు విరాట్. కాగా మ‌హారాష్ట్ర‌లోని నాగ్ పూర్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో మొద‌టి రోజు రెండుసార్లు చేతిలోకి వ‌చ్చిన బంతిని వ‌దిలి వేశాడు విరాట్ కోహ్లీ.

ఇదే స‌మ‌యంలో కామెంట‌రీ బాక్సులో ఉన్న కామెంటేట‌ర్ మార్క్ వా సీరియ‌స్ గా స్పందించాడు. ప్ర‌పంచంలోనే టాప్ ప్లేయ‌ర్ గా ఉన్న విరాట్ కోహ్లీ ఇలాగేనా ఆడేది..వ్య‌వ‌హ‌రించేది అంటూ మండిప‌డ్డాడు మార్క్ వా(Mark Wagh) .

రెండు క్యాచ్ లు వ‌దిలి పెట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా స్కిప్ప‌ర్ పాట్ క‌మిన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 16వ ఓవ‌ర్ లో ఆసిస్ స్టార్ ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్ ఇచ్చిన క్యాచ్ ను కోహ్లీ జార విడిచాడు. ఇంత సులువైన బాల్ ను ఎలా మిస్ చేస్తారంటూ ఫైర్ అయ్యాడు మార్క్ వా. అక్ష‌ర్ ప‌టేల్ ఈ బాల్ ను వేశాడు.

బాడీ ప్ర‌జెంట్ గా నే ఉంది కానీ మైండ్ పూర్తిగా దొబ్బింది అంటూ ఎద్దేవా చేశాడు కామెంట‌రీ పొజిష‌న్ లో ఉన్న మార్క్ వా కీల‌క వ్యాఖ్య‌లు చేయడం రాద్దాంతానికి దారి తీసింది. భార‌త క్రికెట్ అభిమానులతో పాటు విరాట్ కోహ్లీ(Virat Kohli) ఫ్యాన్స్ మార్క్ వాపై మండిప‌డుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా నిప్పులు చెరుగుతున్నారు. క్రికెట‌ర్ అన్నాక త‌ప్పులు స‌హ‌జ‌మ‌ని పేర్కొన్నారు.

Also Read : టెస్టుల్లో అశ్విన్ అరుదైన రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!