Mallikarjun Kharge : మోదీ పాలనలో స్వేచ్చకు మంగళం
పార్లమెంట్ లో కూడా స్వతంత్రం కరువైంది
Mallikarjun Kharge : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ దేశంలో మోదీ పాలన వచ్చాక మాట్లాడటం కూడా నేరంగా మారిందని ఆరోపించారు. జార్ఖండ్ లోని సాహెబ్ గంజ్ జిల్లాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు ఖర్గే(Mallikarjun Kharge). పార్లమెంట్ లో దేశం కోసం ప్రశ్నించిన తన మాటలను కొన్ని భాగాలను తొలగించారని మండిపడ్డారు.
ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు ఏఐసీసీ చీఫ్. దేశంలో ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలను అభివృద్ది చేసింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని స్పష్టం చేశారు. కానీ ఇవాళ మోదీ ప్రభుత్వం వచ్చాక తమ పార్టీ కాపాడుకుంటూ వచ్చిన ప్రభుత్వ సంస్థలు, ఆస్తులను గంప గుత్తగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు మల్లికార్జున్ ఖర్గే.
దేశంలో వాక్ స్వాతంత్రం అన్నది లేకుండా పోయిందని ఆరోపించారు. పార్లమెంట్ లో కానీ బయట కానీ స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకంగా రాచరిక వ్యవస్థను తలపింప చేసేలా పాలన సాగుతోందని తనకు ఎవరూ ఎదురు చెప్పకూడదని మోదీ ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు ఏఐసీసీ చీఫ్(Mallikarjun Kharge).
2014లో అవినీతి, అక్రమాలను నిర్మూలిస్తామని, ద్రవ్యోల్బణాన్ని రూపు మాపుతామని హామీ ఇచ్చి ప్రధానమంత్రి పవర్ లోకి వచ్చారని కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చ లేదని మండిపడ్డారు మల్లికార్జున్ ఖర్గే. బీజేపీ అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు, పేదరికం పెరిగాయని తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్.
Also Read : త్రిపుర దక్షిణాసియాకు గేట్ వే – మోదీ