Supreme Court Adani : అదానీకి షాక్ విచారణకు కేంద్రం ఓకే
సుప్రీంకోర్టు ఆదేశాలకు దిగొచ్చిన మోదీ
Supreme Court Adani : అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ కొట్టిన దెబ్బకు షేర్ల విలువ అంతకంతకూ దిగజారుతోంది. కొంత కాలంగా ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 3లో ఉన్న అదానీ హిండెన్ బర్గ్ నివేదిక దెబ్బకు ఏకంగా 22వ స్థానానికి దిగజారాడు.
ఇదే సమయంలో భారత ప్రభుత్వ ఆధీనంలోని భారతీయ జీవిత భీమా సంస్థ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున రూ. 22,000 వేల కోట్లకు పైగా అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేశాయి. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం జరిగింది. ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి పార్లమెంట్ లో.
కోట్లాది మందికి సంబంధించిన డబ్బులను ఎలా ప్రైవేట్ సంస్థలో పెట్టుబడి పెడతారంటూ ప్రశ్నించింది. దీనినే సవాల్ చేస్తూ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం(Supreme Court Adani) కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. దాంతో ఎట్టకేలకు మోదీ ప్రభుత్వం దిగి వచ్చింది. కమిటీలో ఎవరెవరు ఉండాలనే దానిపై పేర్లను సూచించాలని కోర్టును కోరింది కేంద్రం.
ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడడంలో స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) అప్రమత్తంగా ఉందని తెలిపింది. అదానీ గ్రూప్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
Also Read : పోటీ అబద్దం మోదీతో యుద్ధం – సీఎం