LTTE Prabhakaran Comment : ‘పులి’ ఇంకా బ‌తికే ఉందా

ప‌జా నిడుమార‌న్ కామెంట్స్ వైర‌ల్

LTTE Prabhakaran Comment : ప్ర‌పంచ చ‌రిత్ర‌లో ఒక చెర‌ప‌లేని అధ్యాయం వేలుపిళ్లై ప్ర‌భాక‌ర‌న్(LTTE Prabhakaran). ఏమిటి పులి ఇంకా బ‌తికే ఉందా అన్న అనుమానం మ‌ళ్లీ మొల‌కెత్తుతోంది. దీనికి కార‌ణంగా త‌మిళనాడులో పేరొందిన రాజ‌కీయ నాయ‌కుడు, ర‌చ‌యిత‌, సంపాద‌కుడు, మాజీ కాంగ్రెస్ దిగ్గ‌జం ప‌జా నిడుమార‌న్ చేసిన ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపింది.

యావ‌త్ లోకాన్ని విస్తు పోయేలా చేసింది. 2009లో శ్రీ‌లంక సైన్యంతో చంప‌బ‌డిన ఎల్టీటీఈ చీఫ్ ప్ర‌భాక‌ర‌న్ ఇంకా బ‌తికి ఉండ‌డం ఏంటి. ఇది క‌థ‌నా లేక క‌ల్పన‌నా లేక ఊహాశ‌క్తినా. ఇలా అనుకోవ‌డానికి వీలులేదు. ఎందుకంటే ఈ విష‌యాన్ని చెప్పింది సామాన్యుడు కాదు.

త‌మిళ‌నాడు చ‌రిత్ర‌లో స‌మున్న‌త నాయ‌కుడిగా ఎదిగిన వ్య‌క్తి. అంతే కాదు శ్రీ‌లంక‌లో త‌మిళులు ఎదుర్కొంటున్న దారుణాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించిన సాహ‌సి.

మ‌రి అలాంటి అగ్ర నేత చెబితే అందులో వాస్త‌వం ఎందుకు ఉండ‌ద‌ని బుద్ది జీవులు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌పంచంలోని త‌మిళుల హ‌క్కుల కోసం ధిక్కార స్వ‌రం వినిపించిన యోధుడు వేలుపిళ్లై ప్ర‌భాక‌ర‌న్(LTTE Prabhakaran).  అత‌డిని కోట్లాది మంది త‌మిళ టైగ‌ర్ అని పిలుచుకుంటారు. 

అంత‌కంటే ఆరాధిస్తారు. ఇన్నేళ్లు ఎక్క‌డ ఉన్నాడు. ఉంటే ఎందుకు క‌నిపించ లేదు అన్న‌వి జవాబు దొర‌క‌ని ప్ర‌శ్న‌లు. స‌రిగ్గా మే 19, 2009న ప్ర‌భాక‌ర‌న్ చంప‌బ‌డ్డాడు. దీనిని శ్రీ‌లంక ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా విడుద‌ల చేసింది. ద‌క్షిణాసియాలో సుదీర్ఘ‌మైన యుద్దం ముగిసింద‌ని వెల్ల‌డించింది. 

ఆనాటి నుంచి నేటి దాకా త‌మిళుల బ‌తుకులు మార లేదు. ప్ర‌స్తుతం శ్రీ‌లంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని, ప్ర‌భాక‌ర‌న్ ట‌చ్ లోనే ఉన్నాడ‌ని త్వ‌ర‌లో రానున్నాడ‌ని స్ప‌ష్టం చేశారు నెడుమార‌న్.

చ‌రిత్ర‌ను త‌వ్వితే ఎన్నో ఘ‌ట‌న‌లు..అందులో ర‌క్త‌పాతం కానిది ఏదీ లేదు. ప్ర‌తి పేజీలో కొన్ని ర‌క్త‌పు మ‌ర‌కులు ఉండి ఉంటాయి. ఇది నిజం కాద‌న‌లేని స‌త్యం. అస‌లు ఎవ‌రీ ప్ర‌భాక‌ర‌న్.

ఎందుకు ఇంతలా ప్ర‌భావితం చేయ‌గ‌లిగాడు. స్వంత ఆర్మీని ఏర్పాటు వెనుక ఏం కార‌ణ‌మై ఉంటుది అన్న‌ది అంతు చిక్క‌ని ప్ర‌శ్న‌. అస‌లు ప్ర‌భాక‌రన్ పూర్తి పేరు తిరువేంగ‌డం వేలుపిళ్లై ప్ర‌భాక‌ర‌న్. 26 న‌వంబ‌ర్ , 1954లో పుట్టాడు. తిరుమేని కుటుంబానికి చెందిన వాడు. తండ్రి ఉద్యోగ రీత్యా బ‌దిలీ కావ‌డంతో వివిధ బ‌డుల్లో చ‌దివాడు. 

అత‌డికి చ‌రిత్ర అంటే ఇష్టం. నిరంత‌రం అధ్య‌య‌నం చేశాడు. భార‌త స్వాతంత్ర సంగ్రామం ఆక‌ట్టుకుంది. గాంధీ, నేతాజీని చ‌దివాడు. కానీ ప్ర‌భాక‌ర‌న్ ను గాంధీ కంటే నేతాజీని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డేలా చేసింది. అత‌డిని ఎక్కువ‌గా ప్ర‌భావితం చేసింది..నేను నా చివ‌రి ర‌క్త‌పు బొట్టును చిందించే వ‌ర‌కు నా భూమి స్వేచ్ఛ కోసం పోరాడుతాను అని. 

మ‌హాభార‌తం కూడా ఇష్ట‌ప‌డేవాడు. ప్ర‌బాక‌ర‌న్ గీత‌లో చెప్పిన సూత్రాల ప‌ట్ల ఆక‌ర్షితుడ‌య్యాడు. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారు పేరు. వంట‌కాడు కూడా. మంచి వంట వాడు మాత్ర‌మే మంచి గెరిల్లా కాగ‌ల‌డు అని ఒక సంద‌ర్భంలో పేర్కొన్నాడు. 

వేణుగోపాల్ మాస్ట‌ర్ అంటే అభిమానం ప్ర‌భాక‌ర‌న్ కు. 1972లో త‌మిళ కొత్త టైగ‌ర్స్ స్థాపించారు. త‌మ‌ను తాము టీఎన్టీ అని పిలుచుకున్నారు. జూలై 1975లో మాజీ జాఫ్నా ఎంపీ , మేయ‌ర్ దుర‌య‌ప్ప ను హ‌త్య చేశారు. ఇందులో న‌లుగురు పాల్గొన్నారు. ఇదే త‌న మొద‌టి సైనిక చ‌ర్య‌గా పేర్కొన్నాడు ప్ర‌భాక‌ర‌న్

టీఎన్టీ 5 మే, 1976లో లిబ‌రేష‌న్ టైగ‌ర్స్ ఆఫ్ త‌మిళ్ ఈలం (ఎల్టీటీఈ) గా రూపాంత‌రం చెంది. త‌మిళ ఈలం డిమాండ్ ను అధికారికంగా ఆమోదించింది.

ప్ర‌భాక‌రన్ ను మ‌ణి , మ‌ణియం అని పిలువ‌బ‌డేవాడు. ఆ త‌ర్వాత క‌రికాల‌న్ అని కూడా పేరు వ‌చ్చింది. ఎల్టీటీఈకి క‌మాండ‌ర్ మాత్ర‌మే. 1980లో అది చిన్నాభిన్న‌మైంది. 1981లో తిరిగి బ‌లంగా త‌యారైంది.

ఆ త‌ర్వాత ఎల్టీటీఈ ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన గెరిల్లా సంస్థ‌గా మారింది. ఆనాటి ప్ర‌ధాని రాజీవ్ గాంధీని హ‌త్య చేయ‌డంతో ఒక్క‌సారిగా ఎల్టీటీఈ పేరు మారుమ్రోగింది. 2009లో ప్ర‌భాక‌రన్ ను మ‌ట్టుపెట్టింది శ్రీ‌లంక సైన్యం.

ముల్లై తీవు మ‌డుగు స‌మీపంలో అత‌డి మృత‌దేహం క‌నుగొన‌బ‌డింది. మ‌రి చ‌ని పోయిన ప్ర‌భాక‌ర‌న్(LTTE Prabhakaran) ఎలా బ‌తికి ఉన్నాడ‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. దీనికి ప‌జా నెడుమార‌నే స‌మాధానం చెప్పాలి. అవును త‌మిళ టైగ‌ర్ (పులి) ఇంకా చ‌ని పోలేదా..ఏమో..కాల‌మే దానికి సాక్ష్యం కానుందా అన్న‌ది వేచి చూడ‌డం త‌ప్ప‌.

Also Read : వామ‌ప‌క్షం ఖ‌తం కాషాయం ఖాయం – సీఎం

Leave A Reply

Your Email Id will not be published!