WPL Auction 2023 : ఐపీఎల్ వేలంలో అమ్మాయిలు అదుర్స్
మహరాణులుగా మారిన మహిళా క్రికెటర్లు
WPL Auction 2023 : అదృష్టం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతం క్రికెట్ ను ఓ మతంగా భావించే భారత దేశంలో కాసుల వర్షం కురుస్తోంది. నిన్నటి దాకా పురుషుల ఐపీఎల్ కు మాత్రమే ప్రయారిటీ ఉండేది. కానీ ప్రపంచ క్రికెట్ లో మోస్ట్ పాపులర్ క్రీడా సంస్థగా పేరు పొందింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).
మార్చిలో నిర్వహించే ఉమెన్స్ ఐపీఎల్ లో(WPL Auction 2023) ఆడే ఐదు ఫ్రాంచైజీలు తమ జట్ల కోసం వేలం పాటలో పాల్గొన్నాయి. ముంబై వేదికగా జరిగిన ఆక్షన్ లో మహిళా క్రికెటర్లకు మహర్దశ తిరిగింది. ముంబై స్టార్ ప్లేయర్..హిట్టర్ గా పేరొందిన స్మృతీ మందాన ఏకంగా రూ. 3.40 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కైవసం చేసుకుంది.
ఇది భారతీయ మహిళా క్రికెట్ లో ఓ అరుదైన రికార్డ్. ఇందులో ముంబై , బెంగళూరు, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ , గుజరాత్ ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. 1525 మందికి పైగా ప్రపంచ వ్యాప్తంగా ఆడుతున్న ప్లేయర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
ఇందులో బీసీసీఐ కేవలం 409 మందిని మాత్రమే ఎంపిక చేసింది. వీరిలో మొత్తం 90 మంది క్రికెటర్ల కోసం పోటీ పడ్డాయి ఫ్రాంచైజీలు. ఆర్సీబీ అత్యధికంగా ధర పెట్టి స్మృతీ మంధానను తీసుకుంది. యూపీ దీప్తి శర్మను రూ. 2.60 కోట్లకు, ఢిల్లీ జెమీమమాను రూ. 2.20 కోట్లకు , షెఫాలీ వర్మను రూ. 2 కోట్లకు , పూజా వస్త్రాకర్ ను రూ. 1.90 కోట్లకు ముంబై చేజిక్కించుకుంది.
వీరితో పాటు యస్తికా భాటియాను రూ. 150 కోట్లకు, హర్మన్ ప్రీత్ కౌర్ ను రూ. 1.8 కోట్లకు ముంబై ఫ్రాంచైజ్ కొనుగోలు చేసింది. రిచా గోష్ రూ. 1.90 కోట్లు, రేణుకా సింగ్ రూ. 1.50 కోట్లకు బెంగళూరు , హర్లీన్ ను గుజరాత్ ఫ్రాంచైజ్ రూ. 40 లక్షలకు తీసుకుంది. ఇక విదేశీ ఆటగాళ్లకు సంబంధించి చూస్తే..ఆస్ట్రేలియాకు చెందిన గార్డెనర్ ను రూ. 3.2 కోట్లకు గుజరాత్ తీసుకుంది.
బ్రంట్ ను రూ. 3.20 కోట్లకు ముంబై , బెత్ మూనీని రూ. 2 కోట్లకు గుజరాత్ , పెరీ ని రూ. 1.70 కోట్లకు బెంగళూరు, సోఫీని రూ. 1.8 కోట్లకు యూపీ ఫ్రాంచైజీ తీసుకుంది. ఈ వేలం పాటలో తెలుగు వారైన అమ్మాయిలు కూడా అదృష్టం వరించింది. ఏపీలోని కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన అంజలి శర్వాణి ని యూపీ రూ. 55 లక్షలకు తీసుకుంది. యశశ్రీని యూపీ రూ.10 లక్షలకు తీసుకుంది.
Also Read : రూ. 3.4 కోట్లతో స్మృతీ మంధాన రికార్డ్