Dinesh Karthik Praises Mallika : మల్లికా సాగర్ సూపర్ – కార్తీక్
మహిళా ఐపీఎల్ వేలం పాట అదుర్స్
Dinesh Karthik Praises Mallika : వచ్చే మార్చి లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ఆధ్వర్యంలో మహిళా ఇండియన్ ప్రీమీయర్ లీగ్ మెగా ఈవెంట్ నిర్వహించనుంది. ఇప్పటికే ఐదు ఫ్రాంచైజీలు భారీ ఎత్తున బీసీసీఐకి చెల్లించాయి.
తాజాగా ఇందుకు సంబంధించి ఆయా ఫ్రాంచైజీలకు సంబంధించిన జట్ల ఎంపికకు సంబంధించి ముంబైలో ఐపీఎల్ వేలం పాట నిర్వహించింది. మొత్తం 1525 మంది మహిళా క్రికెటర్లు పేర్లు నమోదు చేశారు. చివరకు బీసీసీఐ 409 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది.
ఇందులో 5 ఫ్రాంచైజీలకు సంబంధించి మొత్తం 90 మంది మహిళా క్రికెటర్లను ఎంపిక చేసింది. ఇదిలా ఉండగా ఈసారి తొలిసారి నిర్వహించిన ఉమెన్ ఐపీఎల్ వేలం పాటను ప్రత్యేకంగా నిర్వహించారు ప్రముఖ ఆర్ట్ కలెక్టర్, కన్సల్టెంట్ మల్లికా సాగర్. ఆమెను ఏరికోరి కేవలం ఐపీఎల్ ఆక్షన్ కోసం ఎంపిక చేసింది బీసీసీఐ. ఇప్పటికే మల్లికా సాగర్ గతంలో 2021లో కబడ్డీ టోర్నీకి సంబంధించి వేలం పాట చేపట్టింది. దీనిని పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ ఆమెకు బాధ్యతలు అప్పగించింది.
అందరూ విస్తు పోయేలా వేలం పాటను నిర్వహించి తనకు ఎదురే లేదని చాటింది. ప్రశంసలు అందుకుంది మల్లికా సాగర్. ఈ సందర్భంగా క్రికెటర్ దినేష్ కార్తీక్(Dinesh Karthik Praises Mallika) ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు. భారత దేశ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఓ మహిళ వేలం పాట నిర్వహించడం అద్భుతమన్నాడు. మల్లికా సాగర్ అద్భుతమైనరీతిలో వేలం పాట నిర్వహించారని, చాలా కాన్ఫిడెంట్ తో, క్లియర్ గా , నేర్పుతో వ్యవహరించిందని ట్వీట్ చేశాడు.
Also Read : విరాట్ కోహ్లీ నాకు స్పూర్తి – జెమీమా