Salil Gupte : మా సక్సెస్ కస్టమర్లపై ఆధారపడి ఉంది
బోయింగ్ ఇండియా చీఫ్ సలీల్ గుప్తే
Salil Gupte : బోయింగ్ ఇండియా చీఫ్ సలీల్ గుప్తే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా విజయం పూర్తిగా కస్టమర్లపై ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. ఎయిర్ ఇండియా డీల్ పై తన అభిప్రాయాలను ఈ సందర్భంగా పంచుకున్నారు.
ఎయిర్ ఇండియా విజయానికి బోయింగ్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని అన్నారు సలీల్ గుప్తే(Salil Gupte). వాణిజ్య విమానయాన చరిత్రలో అతి పెద్ద షాటింగ్ ఈవెంట్ గా నిలిచిన మల్టీ బిలియన్ డాలర్ల ఎయిర్ ఇండియా డీల్ పై బోయింగ్ ఇండియా చీఫ్ తన ఆనందాన్ని పంచుకున్నారు.
ఎయిర్ ఇండియా , దాని కొత్త యజమాని , టాటా గ్రూప్ కు ధన్యవాదాలు తెలిపారు సీల్ గుప్తే. బోయింగ్ తమ విజయానికి అవిశ్రాంతంగా కృషి చేస్తుందన్నారు. భారత దేశంలో బోయింగ్ కు నాయకత్వం వహించాలనే కలను జీవించే భారతీయ అమెరికన్ గా ఇది గర్వ కారణంగా ఉందన్నారు సలీల్ గుప్తే(Salil Gupte).
మా విజయం లేదా సక్సెస్ కస్టమర్ల పై ఆధారపడి ఉంటుందన్నారు. మీ విశ్వాసానికి , మాపై ఉంచిన నమ్మకానికి తాము శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా సలీల్ గుప్తే తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ మేరకు కీలక ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ల్యాండ్ మార్క్ ఒప్పందాలలో భాగంగా ఎయిర్ ఇండియా 470 ప్యాసింజర్ విమానాలను కొనుగోలు చేస్తుంది.
ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్ నుండి 250 , అమెరికా విమానాల తయారీ సంస్థ బోయింగ్ నుండి 220 ఫ్లైట్స్ ను కొనుగోలు చేస్తుంది. ఈ మొత్తం డీల్ కు $80 బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. అమెరికా చీఫ్ బైడెన్ నిన్న ప్రకటించారు. 44 రాష్ట్రాలలో ఒక మిలియన్ ఉద్యోగాలకు ఊతం ఇస్తుందని టాక్.
Also Read : మోదీ శక్తిని చూసి విస్తు పోయా – సిఇఓ