Sania Mirza RCB Mentor : ఆర్సీబీ మెంటార్ గా సానియా మీర్జా
ప్రకటించిన జట్టు యాజమాన్యం
Sania Mirza RCB Mentor : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన ప్రకటన చేసింది. తాజాగా ముంబై వేదికగా మహిళల ఐపీఎల్ కు సంబంధించిన వేలం పాట ముగిసింది. మొత్తం 87 మందిని రూ.55.59 కోట్లకు కొనుగోలు చేశాయి 5 ఫ్రాంచైజీలు. విచిత్రం ఏమిటంటే మొత్తం వేలం పాటలో అత్యధిక ధరకు ముంబైకి చెందిన స్టార్ హిట్టర్ స్మృతి మంధానను రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసింది ఆర్సీబీ. బుధవారం మరో కీలక ప్రకటన చేసింది.
ఇటీవలే టెన్నిస్ రంగం నుంచి నిష్క్రమించిన హైదరాబాద్ కు చెందిన ఇండియన్ టెన్నిస్ రారాణిగా పేరొందిన సానియా మీర్జాను ఆర్సీబీ మహిళా జట్టుకు మెంటార్(Sania Mirza RCB Mentor) గా నియమించినట్లు యాజమాన్యం వెల్లడలించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తెలిపింది. దీంతో ఒక్కసారిగా క్రీడా లోకం విస్మయానికి గురైంది. కారణం ఏమిటంటే ఆమె టెన్నిస్ క్రీడాకారిణి. కానీ ఆమె క్రికెట్ కు కొత్త.
అయితే భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ తో బంధుత్వం ఉంది. తన సోదరిని అజ్జూ కొడుకును పెళ్లి చేసుకుంది.మహిళల కోసం భారతీయ క్రీడలలో అగ్రగామి. యూత్ ఐకాన్ . తన కెరీర్ లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించిన క్రీడాకారిణి సానియా మీర్జా.
మైదానంలోనూ వెలుపల ఛాంపియన్ గా పేరు తెచ్చుకుంది. ఈ సందర్భంగా సానియా మీర్జాను జట్టుకు మెంటార్ గా నియమించామని ఆర్సీబీ ప్రకటించింది. ఆమె తమ జట్టుకు అదనపు బలం అవుతుందని తెలిపింది. మొదట ఆశ్చర్య పోయాను..కానీ ఆనందంగా ఉందన్నారు సానియా మీర్జా.
Also Read : భవిష్యత్తులో పాండ్యానే కెప్టెన్