Microsoft Google Comment : టెక్నాలజీ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రోజు రోజుకు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే నిత్యం మారుతుండడం అనేది సహజ లక్షణం సాంకేతికతలో. ప్రస్తుతం చాట్ జీపీటీ ఏఐ దెబ్బకు ఐటీ కంపెనీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
ఈ తరుణంలో ఏఐతో అనుసంధానమై మైక్రోసాఫ్ట్ సెర్చింగ్ ఇంజిన్ బింగ్ పని చేస్తోంది. రాబోయే కాలంలో తాము గూగుల్ సెర్చింగ్ ఇంజన్ తో ఢీకొనడం ఖాయమని, సవాల్ విసిరారు మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల(Microsoft Google Comment).
విచిత్రం ఏమిటంటే గూగుల్ సంస్థకు సిఇఓ సుందర్ పిచాయ్. ఇద్దరూ భారత దేశానికి చెందిన ప్రవాస భారతీయులు. మోస్ట్ పాపులర్ సిఇఓలలో ఇద్దరూ కీలకమైన వ్యక్తులు. ఇదే సమయంలో ఇద్దరూ దక్షిణాదికి చెందిన వారు కావడం విశేషం.
ఒకరు ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన వారైతే మరొకరు తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఇద్దరూ టెక్నికల్ గా ఎక్స్ పర్ట్స్. సత్య నాదెళ్ల మౌనంగా ఉంటారు. కానీ పనిపై ఎక్కువగా ఫోకస్ పెడతారు. నిక్కచ్చిగా ఉంటారు. అంతే కాదు సామాజిక సేవలకు ప్రయారిటీ ఇస్తారు. ఇది ఆయన ప్రత్యేకత.
ఇక వేతనంలోనే కాదు టెక్నికల్ గా ఎప్పటికప్పుడు చోటు చేసుకున్న కొత్త పోకడలను గుర్తించడం, వాటిని కనుగొనడం, వాటిని ప్రోత్సహించడంలో ముందంజలో ఉంటాడు సుందర్ పిచాయ్.
తాజాగా సత్య నాదెళ్ల ఎన్నడూ లేనంగా కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే ప్రపంచంలోని టెక్నాలజీ రంగంలో కొత్త మార్పు రాబోతోందంటూ వెల్లడించాడు. ఇది గూగుల్ కు సవాల్ విసురుతున్నానని ప్రకటించాడు. దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆపై స్పందించనూ లేదు సుందర్ పిచాయ్.
ఎందుకంటే యావత్ ప్రపంచం ఇప్పుడు సుందర్ పిచాయ్ తయారు చేసిన ఆండ్రాయిడ్ లోనే సేద దీరుతోంది. ఎంతగా చాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చినా గూగుల్ కూడా తనవంతుగా ప్రయత్నాలు చేస్తోంది. దాని దరిదాపుల్లోకి రావాలంటే చాలా కష్ట పడాల్సి ఉంటుంది.
గత కొన్నేళ్ల నుంచి గూగుల్ తో పోటీ పడేందుకు ఎన్నో కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. లక్షలాది మంది తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులోనే లీనమయ్యారు. టెక్నాలజీ పరంగా ప్రతి ప్రొడక్ట్ లోనూ లాభాలు ఉంటాయి..మరికొన్ని నష్టాలు లేక పోలేదు.
అయితే కాలం విచిత్రమైంది. ఇద్దరు భారతీయులు తమ టెక్నాలజీకి పదును పెడుతున్నారు. సవాళ్లను విసుతురుతున్నారు. రాబోయే రోజుల్లో గూగుల్ కూడా చాట్ జీపీటీని పోటీ దారుగా తీసుకుంటుందా లేక దానికి ప్రత్యామ్నాయంగా మరొకటి తయారు చేస్తుందా అన్నది చూడాలి. ఇది పక్కన పెడితే వేటికవే తమదైన పద్దతుల్లో పని చేస్తున్నాయి.
సెర్చింగ్ ఇంజన్ ల మధ్య పోటీ 14 ఏళ్ల కిందట ప్రారంభమైంది. యాహూ, రీడిఫ్ , లైకోస్ , ఎక్సైట్ తో పాటు బింగ్ వచ్చింది. వాటిని దాటుకుంటూ గూగుల్ ఏకశ్చత్రాధిపత్యాన్ని కలిగి ఉంది. ఇప్పుడు బింగ్ దానిని అధిగమిస్తుందా అంటే చెప్పలేం.
ఇప్పటికీ కోట్లాది మంది వాడుతున్నది గూగుల్ నే. సత్య గెలుస్తాడా..పిచాయ్ నిలుస్తాడా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.
Also Read : 840 ఫ్లైట్స్ కు ఎయిర్ ఇండియా ఆర్డర్