CJI Governors Comment : ‘గవర్నర్లు’ లక్ష్మణ రేఖ దాటితే ఎలా
సీజేఐ చంద్రచూడ్ తీర్పు చెంపపెట్టు
CJI Governors Comment : దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లవుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఇటీవలి కాలంలో గవర్నర్లతో పాటు ఎల్జీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 2014 కంటే ముందు ఇంతలా లేదు.
ఎప్పుడైతే నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా కొలువు తీరారో ఆనాటి నుంచి బీజేపీయేతర ప్రభుత్వాలకు కోలుకోలేని రీతిలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన రాజ్ భవన్ లు పొలిటికల్ కేంద్రాలకు కేరాఫ్ గా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రవర్తించిన తీరు సభ్య సమాజాన్ని తలవంచుకునేలా చేసింది . బడ్జెట్ ప్రసంగ పాఠం చదువుతూ పూర్తి చేయకుండా వదిలేసి వెళ్లి పోయారు. చివరకు గవర్నర్ గో బ్యాక్ అనేంత దాకా వెళ్లింది.
ఇక పశ్చిమ బెంగాల్ , కేరళ, తెలంగాణ, తమిళనాడు, బీహార్, చత్తీస్ గఢ్ , పంజాబ్ , జార్ఖండ్ తో పాటు ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ , సీఎంకు మధ్య పడడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే పొసగడం లేదు. ఆయా రాష్ట్రాలలో బీజేపీ లేదు.
కేవలం బీజేపీయేతర రాష్ట్రాలలోనే ఈ వివాదాలు ముదిరి పాకాన పడ్డాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి దిగజారాయి. అంతే కాదు వ్యక్తిగత విమర్శలకు దిగిన సందర్భాలు లేక పోలేదు. ఇటీవల మరాఠాలో చోటు చేసుకున్న పరిణామాలు మరింత దిగజారేలా మారాయి.
చివరకు గవర్నర్ తనంతకు తానుగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరాఠా ప్రజలను అవమానించిన తీరుతో రాష్ట్రంలో పెను తుపాను సృష్టించింది. ప్రతి చోటా ఇదే పరిస్థితి.
కేరళలో సీఎం పినరయ్ విజయన్ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ ,తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ తమిళి సై, తమిళనాడులో ఎంకే స్టాలిన్ వర్సెస్ ఆర్ఎన్ రవి, ఢిల్లీలో కేజ్రీవాల్ వర్సెస్ సక్సేనా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోటా ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది.
ఈ సందర్భంగా ఇటీవల మరాఠాలో గవర్నర్ ప్రవర్తించిన తీరును సవాల్ చేస్తూ భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టింది సీజేఐ ధనంజయ వై చంద్రచూడ్(CJI Governors Comment) నేతృత్వంలోని ధర్మాసనం.
ఒక రకంగా దేశ చరిత్రలో ఈ తీర్పు చెంప పెట్టు అని చెప్పక తప్పదు. ఇప్పటికే ప్రధాన మంత్రి మోదీ(PM Modi) సర్కార్ కు దెబ్బ మీద పడుతోంది సుప్రీంకోర్టు నుంచి. ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ప్రధానంగా గవర్నర్లు ఏం చేయాలి. ఏం చేయకూడదనే దానిపై స్పష్టం చేశారు. అసలు గవర్నర్లకు రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించారు. ఒక రకంగా నిలదీసినంత పని చేశారు. పార్టీల మధ్య పొత్తు పెట్టుకునే రాజకీయ రంగంలోకి గవర్నర్లు దిగ కూడదని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ హక్కులు కల్పించింది.
ఇదే సమయంలో బాధ్యతలు ఏమిటో గుర్తు చేసింది. ఎవరి పరిధి ఏమిటో గుర్తించి నడుచు కోవాలి. రాష్ట్రానికి గవర్నర్ వాచ్ డాగ్ లాగా ఉండాలి. అంతే కానీ పొలిటికల్ లీడర్ గా మార కూడదని హెచ్చరించారు. గవర్నర్లతో(Governors) పాటు లెఫ్లినెంట్ గవర్నర్ లు లక్ష్మణ రేఖ దాటకూడదు. అది దాటితే రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుంది. ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుందని స్పష్టం చేసింది ధర్మాసనం.
మొత్తంగా ఎవరైనా ఏ పార్టీ అయినా లక్ష్మణ రేఖ అనేది ఒకటి ఉందని తెలుసుకుంటే బెటర్.
Also Read : నగదు రహిత లావాదేవీలలో భారత్ టాప్