Taraka Ratna Died : నందమూరి తారకరత్న కన్నుమూత
23 రోజుల పాటు మృత్యువుతో పోరాటం
Taraka Ratna Died : నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నటుడు నందమూరి తారకరత్న శివరాత్రి పర్వదినం రోజు కన్నుమూశారు(Taraka Ratna Died). ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేశారు. చివరకు తరలి రాని లోకాలకు తరలి వెళ్లారు.
హైదరాబాద్ కు తారకరత్న భౌతిక కాయాన్ని తీసుకు వస్తారు. బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఇవాళ మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.
నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. ఉన్నట్టుండి కుప్ప కూలారు. చికిత్స కోసం వెంటనే కుప్పం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. విషయం తెలిసినప్పటి నుంచి కొడుకు కంటే ఎక్కువగా దగ్గరుండి చూసుకున్నారు నటుడు నందమూరి బాలకృష్ణ. హృదయాలయలో వైద్యులు చివరి వరకు ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేక పోయింది.
శనివారం తారకరత్న ఆరోగ్యం విషమించడంతో నందమూరి బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఆస్పత్రికి చేరుకున్నారు. నందమూరి తారకరత్న ఇక లేరన్న విషయం తెలియగానే ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగి పోయింది. ఇప్పటికే దిగ్గజ దర్శకుడు కే. విశ్వనాథ్ ఇటీవలే మరణించారు. ఇప్పుడు తారకరత్న(Taraka Ratna Died) లోకాన్ని వీడడం విషాదాన్ని నింపింది.
బెంగళూరు ఆస్పత్రి నుంచి నేరుగా హైదరాబాద్ కు తీసుకు వస్తారు. ఇక్కడ అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం.
Also Read : తారకరత్న అంటే బాలయ్యకు ప్రాణం