IND vs AUS Day 3 2nd Test : స్పిన్నర్ల మ్యాజిక్ ఆసిస్ షేక్
113 పరుగులకే ఆలౌట్
IND vs AUS Day 3 2nd Test : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో విజయం సాధించేందుకు అడుగు దూరంలో ఉంది భారత జట్టు(IND vs AUS Day 3 2nd Test). నాలుగు టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో ఇప్పటికే నాగ్ పూర్ లో జరిగిన తొలి టెస్టు లో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. రెండో టెస్టు లో మొదట బ్యాటింగ్ చేసిన పర్యాటక ఆస్ట్రేలియా జట్టు 263 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అనంతరం బరిలోకి దిగిన భారత్ ఒక పరుగు తేడాతో 262 రన్స్ కే చాప చుట్టేసింది.
అనంతరం మైదానంలోకి దిగిన ఆసిస్ కేవలం 113 రన్స్ కే పరిమితమైంది. తొలి టెస్టులో తమ అద్బుతమైన బౌలింగ్ తో ఆసిస్ ను కట్టడి చేసిన బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ , రవీంద్ర జడేజా మరోసారి మాయాజాలం చేశారు. తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు. దీంతో భారత్ ముంగిట తక్కువ టార్గెట్ ముందుంచారు. స్పిన్నర్లకు స్వర్గ ధామంగా పేరొందింది భారత స్టేడియంలు. టీమిండియా సక్సెస్ సాధించాలంటే కేవలం 115 పరుగులు చేయాల్సి ఉంది.
ఏకంగా రవీంద్ర జడేజా 7 వికెట్లు పడగొట్టగా రవి చంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా ఓవర్ నైట్ స్కోర్ ఒక వికెట్ కోల్పోయి 61 పరుగులు చేయగా 3వ రోజు స్పిన్నర్ల ధాటికి తక్కువ స్కోర్ కే కుప్ప కూలింది. పర్యాటక జట్టు 9 వికెట్లు కోల్పోయి 52 రన్స్ చేసింది. అశ్విన్ మొదటి ఓవర్ లోనే 43 రన్స్ వద్ద హెడ్ ను వెనక్కి పంపాడు. 9 పరుగులకు స్మిత్ ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. కుహ్నెమాన్ చివరి బ్యాటర్ గా అవుటయ్యాడు.
Also Read : సఫారీకి షాక్ ఆసిస్ సెమీస్ కు