Virat Kohli Breaks : సచిన్ రికార్డ్ విరాట్ కోహ్లీ బ్రేక్
ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Virat Kohli Breaks : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్ సాధించిన రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 25,000 పరుగులు అత్యంత వేగంగా చేసిన క్రికెటర్ గా గతంలో సచిన్ పేరు మీద ఉండేది. దానిని రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అధిగమించాడు. తన కెరీర్ లో అరుదైన మైలు రాయి చేరుకున్నాడు. న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న 2వ టెస్టులో 3వ రోజు ఈ రికార్డు నమోదు చేశాడు విరాట్ కోహ్లీ(Virat Kohli Breaks).
తన ఆరాధ్య దైవంగా భావించే సచిన్ ను అధిగమించడం విశేషం. 577 మ్యాచ్ లలో దీనిని చేరుకున్నాడు. 25,000 వేల పరుగులు చేసేందుకు సచిన్ కు 577 ఇన్నింగ్స్ లు పడితే విరాట్ కోహ్లీకి కేవలం 549 ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు.
ఇక సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానాలలో ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్ ఈ రన్స్ ను 588 ఇన్నింగ్స్ లు, జాక్వెస్ కలిస్ 594 ఇన్నింగ్స్ , శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర 608 ఇన్నింగ్స్ లలో, మహేళ జయవర్దనే 701 ఇన్నింగ్స్ లలో 25,000 రన్స్ పూర్తి చేశారు.
ఆసిస్ తో జరిగిన రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు. భారత జట్టు మాజీ కెప్టెన్ విరట్ కోహ్లీ 31 బంతులు ఆడి 20 రన్స్ చేశాడు. టాడ్ మర్పీ బౌలింగ్ లో వికెట్ సమర్పించుకున్నాడు. అంతకు ముందు పర్యాటక ఆస్ట్రేలియా జట్టు 113 పరుగులకే చాప చుట్టేసింది.
Also Read : స్పిన్నర్ల మ్యాజిక్ ఆసిస్ షేక్