BCCI Announces ODI Squad : ఆసిస్ తో భార‌త్ వ‌న్డే టీమ్ డిక్లేర్

ప్ర‌క‌టించిన భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు

BCCI Announces ODI Squad : కొత్త ఏడాది భార‌త జ‌ట్టుకు క‌లిసొచ్చింది. ఇప్ప‌టికే శ్రీ‌లంక‌, న్యూజిలాండ్ తో వ‌రుస సీరీస్ లు గెలుచుకుని ఊపు మీదున్నది. ఇదే స‌మ‌యంలో స్వ‌దేశంలో ఆస్ట్రేలియాతో టీమిండియా 4 టెస్టులు , 3 వ‌న్డే మ్యాచ్ ల సీరీస్ లు ఆడ‌నుంది. ఇప్ప‌టికే రెండు టెస్టులు పూర్త‌య్యాయి. నాగ‌పూర్ లో జ‌రిగిన తొలి టెస్టులో, ఢిల్లీలో జ‌రిగిన 2వ టెస్టులో భార‌త్ గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. కాగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తొలి వ‌న్డే మ్యాచ్ కు దూరం కానున్న‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆస్ట్రేలియాతో ఆడే వ‌న్డే సీరీస్ కోసం పూర్తి జ‌ట్టును(BCCI Announces ODI Squad) ప్ర‌క‌టించింది. స్టింగ్ ఆప‌రేష‌న్ కార‌ణంగా చీఫ్ సెలెక్ట‌ర్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నాడు చేత‌న్ శ‌ర్మ‌. అత‌డు లేకుండానే బీసీసీఐ టీమ్ ను ప్ర‌క‌టించ‌డం విశేషం.

ఇప్ప‌టికే పొట్టి ఫార్మాట్ టి20 జ‌ట్టుకు హార్దిక్ పాండ్యాను స్కిప్ప‌ర్ గా డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్ ప‌ర్ ఫార్మెన్స్ దారుణంగా ఉంది. కుటుంబ కార‌ణాల వ‌ల్ల రోహిత్ శ‌ర్మ తొలి వ‌న్డే కు ఆడ‌డం లేద‌ని తెలిపింది. వైస్ కెప్టెన్ పాండ్యా సార‌థ్యం వ‌హిస్తాడ‌ని పేర్కొంది.

ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే ఇలా ఉంది వ‌న్డే జ‌ట్టు. రోహిత్ శ‌ర్మ కెప్టెన్, శుభ‌మన్ గిల్ , విరాట్ కోహ్లీ, శ్రేయ‌స్ అయ్య‌ర్ , సూర్య కుమార్ యాద‌వ్ , కేఎల్ రాహుల్ , ఇషాన్ కిష‌న్ , హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, కుల్దీప్ యాద‌వ్ , వాషింగ్ట‌న్ సుంద‌ర్ , చాహ‌ల్ , ష‌మీ, సిరాజ్ , ఉమ్రాన్ మాలిక్ , శార్దూల్ ఠాకూర్ , అక్ష‌ర్ ప‌టేల్ , జ‌య‌దేవ్ ఉనాద్క‌త్ ఉన్నారు.

Also Read : టీమిండియాపై జే షా ముద్ర

Leave A Reply

Your Email Id will not be published!