NZW ICC T20 World Cup : కీవీస్ సెమీస్ ఆశలు సజీవం
పాకిస్తాన్..శ్రీలంక సెమీస్ కు కష్టమే
NZW ICC T20 World Cup : దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టి20 వరల్డ్ కప్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గ్రూప్ – బిలో ఇంగ్లాండ్ టాప్ లో కొనసాగుతోంది. ఇక గ్రూప్ – ఎలో ఆస్ట్రేలియా మహిళా జట్టు ఇప్పటికే సెమీస్ కు(Semi Finals) చేరుకుంది. తన సీటును ఖరారు చేసింది. గత ఏడాది 2022లో టి20 వరల్డ్ కప్ ఛాంపియన్ గా ఉంది.
ఈసారి కూడా ఆసిస్ కప్ పై కన్నేసింది. ఆ దిశగా పరుగులు తీస్తోంది. ఇక భారత జట్టు విషయానికి వస్తే పాకిస్తాన్ , వెస్టిండీస్ తో గెలుపొందగా ఇంగ్లండ్ తో జరిగిన కీలక పోరులో 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక పాకిస్తాన్ , శ్రీలంక జట్లు సెమీస్ ఆశలు గల్లంతైనట్లే. ఏయే జట్లు సెమీస్ కు చేరుకుంటాయనే దానిపై ఇంకా ఉత్కంఠ నెలకొంది.
ఐసీసీ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో రెండు గ్రూప్ లలో 5 జట్ల చొప్పున లీగ్ మ్యాచ్ లు ఆడుతున్నాయి. ఈ టోర్నీ ముగిసిన వెంటనే బీసీసీఐ ఆధ్వర్యంలో ఉమెన్స్ ఐపీఎల్ జరుగుతుంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం సెమీస్ కు చేరుకునేందుకు వీలుందని కివీస్ స్కిప్పర్ పేర్కొంది. ఆదివారం పార్ల్ లోని బోలాండ్ పార్క్ వేదికగా శ్రీలంకతో జరిగిన కీలక పోరులో ఏకంగా 102 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో మెరుగైన రన్ రేట్ ఆ జట్టు స్వంతమైంది.
అయితే కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ లో(NZW ICC T20 World Cup) బంగ్లాదేశ్ , దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ తర్వాతనే ఏ జట్టు సెమీస్ కు చేరుకుంటుందనేది తేలుతుంది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, కీవీస్ , ఇండియా, ఇంగ్లండ్ మధ్య తుది పోరు కు సిద్దం కానున్నాయి.
Also Read : ఆసిస్ తో భారత్ వన్డే టీమ్ డిక్లేర్