INDW T20 World Cup : టీమిండియా సెమీస్ కు చేరాలంటే
ఐసీసీ మహిళా టి20 వరల్డ్ కప్
INDW T20 World Cup : దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో భారత్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 11 రన్స్ తేడాతో ఓడి పోయింది. విజయపు అంచుల దాకా వచ్చినా ఫలితం లేక పోయింది. ఒకవేళ ఇంగ్లండ్ తో గెలిచి ఉంటే టీమిండియా సెమీస్ కు(INDW T20 World Cup) కచ్చితంగా చేరేది. ప్రస్తుతం మిగతా జట్లు ఆడే మ్యాచ్ లు , గెలుపు ఓటములు, మెరుగైన రన్ రేట్ ఆధారంగా భారత్ సెమీస్ చేరికపై ఆధారపడి ఉంది.
మెగా టోర్నీలో చివరి లీగ్ మ్యాచ్ ఐర్లాండ్ తో ఆడాల్సి ఉంది. ఇప్పటికు వరకు భారత మహిళా జట్టు పాకిస్తాన్ , విండీస్ తో గెలుపొందగా ఇంగ్లండ్ తో ఓటమి పాలైంది. చివరి మ్యాచ్ లో గెలిస్తే ఆరు పాయింట్లతో నిలుస్తుంది. ఇప్పటికే ఇంగ్లండ్ వరుస గెలుపులతో టాప్ లో ఉంది జాబితా పట్టికలో. మరో వైపు గ్రూప్ – ఎలో ఇప్పటికే ఆస్ట్రేలియా టాప్ లోకి చేరింది. సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ తరుణంలో గ్రూప్ -బిలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది.
సెమీస్ ఆశలు ఇంకా కోల్పోలేదు టీమిండియా. ప్రస్తుతం ఇంగ్లండ్ 6 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతుండగా భారత్ 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ రెండు మ్యాచ్ లలో ఒకటి గెలిచి మరోటి ఓడి పోయింది. మూడో స్థానంలో కొనసాగుతోంది. విండీస్ ఒక విజయం రెండు ఓటములతో నాలుగో స్థానంలో నిలిచింది. ఐర్లాండ్ మూడు మ్యాచ్ లలోనూ ఓడి పోయింది అట్టడుగున ఉంది.
Also Read : కీవీస్ సెమీస్ ఆశలు సజీవం