Rohini Sindhuri vs D Roopa : కన్నడ నాట ‘సింధూరి రూప’ వార్
సీనియర్ ఆఫీసర్ల మధ్య గొడవ
Rohini Sindhuri vs D Roopa : కర్ణాటకలో ఇద్దరు సీనియర్ ఆఫీసర్ల మధ్య చోటు చేసుకున్న వివాదం చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం, పైగా సామాజిక మాధ్యమాలలో ఫోటోలను షేర్ చేయడం ఈ గొడవకు కారణమైంది. బీజేపీ ప్రభుత్వంలో వీరిద్దరి గొడవ మరింత ఇబ్బందికి గురి చేస్తోంది.
ఇంతకూ ఆ ఇద్దరు ఉన్నతాధికారులు ఎవరో కాదు ఇప్పటికే పేరొందిన సీనియర్లు సింధూరి , డి రూప మౌద్గిల్(Rohini Sindhuri vs D Roopa). ఇదిలా ఉండగా డి రూపా తన ఫేస్ బుక్ పేజీలో చిత్రాలను పోస్ట్ చేసింది.
సింధూరి వాటిని 2021, 2022 ముగ్గురు ఐఏఎస్ అధికారులతో పంచుకున్నారంటూ ఆరోపించారు. ఇద్దరు ఉన్నతాధికారులు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం సభ్య సమాజాన్ని తలవంచుకునేలా చేసింది. పరిపాలనా పరంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా ఉండడంతో రాష్ట్ర హోం శాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర ఇవాళ తీవ్రంగా స్పందించారు.
ఈ మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా రోహిణి సింధూరికి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు డి రూప మౌద్గిల్(Rohini Sindhuri vs D Roopa).
తన ఫోటోలను మంగ ఐఏఎస్ ఆఫీసర్లకు పంపడం ద్వారా సర్వీస్ కండక్ట్ రూల్స్ ఉల్లంఘించారంటూ ఆరోపించారు. డి. రూపా అవినీతి ఆరోపణల సుదీర్ఘ జాబితాను విడుదల చేశారు. సీఎం బొమ్మై(CM Bommai) , ప్రధాన కార్యదర్శి వందిత శర్మలకు కూడా ఫిర్యాదు చేశారు.
తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు సింధూరి. వారి పేర్లను బహిరంగ పర్చాలని కోరారు. ఇదిలా ఉండగా హోం శాఖ మంత్రి సీరియస్ గా స్పందించారు. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా డి. రూప కర్ణాటక హస్తకళల అభివృద్ది కార్పొరేషన్ కు ఎండీగా ఉన్నారు.
ఇక సింధూరి హిందూ మత సంస్థలు, ధర్మాదాయ శాఖ కమిషనర్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా సింధూరి జనతాదళ్ ఎస్ ఎమ్మెల్యే సారా మహేష్ తో కలిసి కూర్చున్న చిత్రాలు వైరల్ గా మారాయి.
Also Read : తమిళనాడులో ఓలా ప్లాంట్