Shashi Tharoor Samson : శాంసన్ వన్డేలకు పనికి రాడా – థరూర్
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ ఎంపీ
Shashi Tharoor Samson : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ నిప్పులు చెరిగారు. కేరళకు చెందిన స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ కు సంబంధించి ఎందుకు ఎంపిక చేయడం లేదంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం జట్టులో ఎలాంటి ప్రతిభ కనబర్చక పోయినా కొందరిని అదే పనిగా టీమ్ లలో కొనసాగిస్తున్నారంటూ నిలదీశారు ఎంపీ. తాజాగా గత కొంత కాలంగా కేఎల్ రాహుల్ ను కంటిన్యూగా ఎంపిక చేయడాన్ని తీవ్రంగాతప్పు పట్టారు.
మరో వైపు భారత క్రికెట్ జట్టు మాజీ స్టార్ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ నిప్పులు చెరిగాడు. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తీరును ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఏ ప్రాతిపదికన కేఎల్ రాహుల్ ను కొనసాగిస్తున్నారంటూ నిలదీశాడు. ఇప్పటికే బీసీసీఐ పరువును బజారుపాలు చేశాడు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్ చేతన్ శర్మ. ప్రస్తుతం పాలిటిక్స్ కు కేరాఫ్ గా బీసీసీఐ మారి పోయిందంటూ మండిపడ్డాడు ఎంపీ శశి థరూర్(Shashi Tharoor Samson). ఎవరైనా జట్టులో ఆటగాళ్లను ఎంపిక చేసే సమయంలో వారు కనబర్చిన ప్రతిభను చూస్తారని కానీ బీసీసీఐ అలా పట్టించు కోవడం లేదంటూ ఫైర్ అయ్యారు.
విచిత్రం ఏమిటంటే సంజూ శాంసన్ అంటే విపరీతమైన అభిమానం థరూర్ కు. ఆయన ప్రతిసారి ఎంపిక చేయక పోవడాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇక కేఎల్ రాహుల్ గత ఏడాది నాలుగు టెస్టులు ఆడాడు. 17.12 సగటుతో 137 రన్స్ చేశాడు. గత ఏడాది 10 వన్డేలు ఆడాడు. 27.88 సగటుతో 251 రన్స్ చేశాడు. రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా శశి థరూర్ లేవదీసిన ప్రశ్నకు బీసీసీఐ సమాధానం చెప్పే స్థితిలో లేదు.
Also Read : కేఎల్ రాహుల్ పై చాట్ జిపిటి కామెంట్